అయ్యయ్యో.. రష్మికను మళ్ళీ తిడుతున్నారే..?

Update: 2022-12-29 04:03 GMT
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు ఫ్యాన్ ఇండియా హీరోయిన్ గా కూడా క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ అప్పుడప్పుడు ఊహించిన విధంగా కొన్ని కాంట్రవర్సీ విషయాల్లో తలదూరుస్తూ ఉంటుంది. ఇక ఆమె అనుకోకుండా చేసే కామెంట్స్ కూడా ఊహించని విధంగా కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ ఉంటాయి.

ఇక ఆమె ఆలోచించి అంటుందో లేక అనుకోకుండా అంటుందో తెలియదు కానీ ఇతర ఇండస్ట్రీలపై చేసే కొన్ని వ్యాఖ్యలు కూడా ఓవర్గం వారిని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తూ ఉంటాయి. ఆ మధ్య సొంత భాష నుంచి వచ్చిన కాంతార సినిమా చూడలేదు అని అలాగే రిషబ్ ఫస్ట్ ఛాన్స్ ఇవ్వలేదని కూడా ఆమె పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఒక విధంగా రష్మిక మందన్న పై బ్యాన్ విధించే ఛాన్స్ కూడా ఉందని కన్నడ చిత్ర పరిశ్రమలో అనేకరకాల కామెంట్స్ అయితే వినిపించాయి.

ఇక తర్వాత రష్మిక తన వివాదాలపై కొంత క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా అదేమీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక మెల్లగా ఆ గొడవలను మర్చిపోతున్న సమయంలోనే అమ్మడు ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీని పొగుడుతూ కామెంట్ చేయడంతో మళ్లీ ఆమెపై నెగటివ్ కామెంట్స్ అయితే మొదలవుతున్నాయి.

బాలీవుడ్ లో రష్మిక చేసిన మిషన్ మజ్ను నెట్ ఫ్లిక్స్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.ఇక ఆ సినిమా ప్రమోషన్స్ లో రశ్మిక చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

బాలీవుడ్ సినిమాలలో రొమాంటిక్ లవ్ సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అని చిన్నప్పటి నుంచి నాకు హిందీ భాషలోనే లవ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అని ఆమె కామెంట్ చేసింది. దీంతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా మాస్ మసాలా సాంగ్స్ ఉంటాయి అని పరోక్షంగా కామెంట్ చేసింది అని సౌత్ ఇండస్ట్రీలోని భారీ స్థాయిలో విజయాలను అందుకున్న రష్మిక మందన ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని ఓవర్గం వారు గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై అమ్మడు ఏదైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News