ఒకరిని మించి ఒకరు ఎదిగేందుకు పోటీపడడం తప్పేమీ కాదు. కానీ అవకాశాల పరంగా పోటీ ఒక్కోసారి ఊహించని విధంగా కోల్డ్ వార్ గా మారుతుంటుంది. స్టార్ హీరోయిన్ల మధ్య ఇలాంటివి అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి. ఒకరి నుంచి అవకాశాన్ని ఇంకొకరు లాక్కునే పరిస్థితి ఉంటుంది. క్రేజీ భామల మధ్య ఇలాంటి వ్యవహారాలున్నా తొందరగా అవేవీ బయటకు రావు. మార్కెట్ పై ప్రభావం పడుతుంది కాబట్టి ఎంతో జాగ్రత్తపడుతుంటారు. తాజాగా ఇద్దరు టాప్ హీరోయిన్ల నడుమ ఇలాంటి కోల్డ్ వార్ చోటు చేసుకుందని తెలుస్తోంది.
అయితే ఇది సినిమా ఛాన్స్ కాదు. ఓ కమర్శియల్ యాడ్ కోసం సిగపట్టు పట్టినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా భామలు అంటే? రష్మిక మందన్నా...పూజాహెగ్డే. ఆ ఇద్దరూ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్లగా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో వరుస చిత్రాలు చేస్తున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడి నటిస్తున్నారు. ఆ భామలిద్దరి కోసం దర్శక..నిర్మాతలు క్యూ కడుతున్నారు. మార్కెట్ లోకి ఇద్దరి డిమాండ్ దాదాపు సరి సమానం. అయితే లాట్ మోబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయాలని సదరు సంస్థ ముందుగా పూజాహెగ్డేని అప్రోచ్ అయింది.
అందుకు గాను ఈ బ్యూటీ రెండు కోట్లు డిమాండ్ చేసిందిట. పారితోషికం మరీ అధికం కావడంతో సదరు కంపెనీ వెనక్కి తగ్గి రష్మికను లైన్ లోకి తెచ్చిందట. ఈ భామని కంపెనీ 50 లక్షలకే లాక్ చేసిందిట. ఆమె డిమాండ్ 70 లక్షలు ఉండగా కంపెనీ 50 లక్షలకి లాక్ చేసినట్లు సమాచారం. ఇదే దారిలో మరికొన్ని కార్పోరేట్ కంపెనీలు ఉన్నాయట. ఇమేజ్ పేరు చెప్పి భారీ మొత్తాల్ని దారబోయడం కన్నా.. రష్మికలా తక్కువ మొత్తానికే ప్రకటనల్లో నటించే వారిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం అని కార్పొరెట్ కంపెనీలు భావిస్తున్నాయట. ఈ ఫార్ములా ప్రకారం.. రష్మిక ముంగిట మరికొన్ని సంస్థలు క్యూ కట్టడం ఖాయం.