``నన్ను నేను ఆశ్చర్యపోయేలా చేయడాన్ని ఇష్టపడతాను. నేను నిజంగా ఇలా చేస్తున్నానా? అనిపించాలి. మిమ్మల్ని మీరు ఆశ్చర్యపర్చినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది`` అని అన్నారు రష్మిక మందన. అభిమానులు నన్ను వేర్వేరు పాత్రలలో చూడాలి. అది అంత సులభం కాదు.. కానీ నేను ప్రయత్నిస్తున్నాను అని తెలిపారు. గీతా గోవిందం- డియర్ కామ్రేడ్ -మిషన్ మజ్ను- గుడ్ బాయ్ .. ఆడాళ్లు మీకు జోహార్లు.. పుష్ప.. ఇలా ఎంచుకున్నవన్నీ దేనికదే ప్రత్యేకం. విభిమన్నమైన పాత్రల్లో చేస్తున్నాను.. అని రష్మిక వెల్లడించారు.
తెలుగు పరిశ్రమలో వరుస బ్లాక్ బస్టర్ లతో కేవలం అగ్ర హీరోల సరసన మాత్రమే నటిస్తున్న రష్మిక మందన అనూహ్యంగా బాలీవుడ్ లో అడుగు పెట్టేయడం అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల `టాప్ టక్కర్` మ్యూజిక్ వీడియోతో హిందీ వినోద సన్నివేశంలోకి ప్రవేశించిన తీరు ఆసక్తికరం. తొలి హిందీ చిత్రం మిషన్ మజ్ను చిత్రీకరణలో ఉండగానే.. రష్మిక తన రెండవ హిందీ చిత్రం గుడ్ బై కు సంతకం చేశారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ తో కలిసి కీలక పాత్రలో నటించేస్తున్నారు. బిగ్ బితో ఇంత తొందరగా అవకాశం వస్తుందని తాను ఊహించలేదని ఆయనతో పిన్న వయసులో నటించే అవకాశం తనకు దక్కిందని రష్మిక ఉబ్బితబ్బిబ్బయ్యారు.
తాను ప్రతిసారీ కొత్తగా ప్రయత్నించినపుడు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుందని అదే తనను వైవిధ్యం వైపు నడిపిస్తుందని రష్మిక చెప్పారు. నేను నటన రంగంలో ఒక అనుభవశూన్యురాలిని కాబట్టి విభిన్నమైన పనులు చేసినప్పుడు జనాల స్పందన ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తిగా ఉంటుంది. నా కోసం నేను అదే కంటెంట్ ను రెండుసార్లు చూడలేను. అందుకే ప్రతిసారీ కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తాను.. అని అన్నారు.
కన్నడలో కిరిక్ పార్టీ తర్వాత తెలుగులో ఛలో చిత్రంలో నటించి తొలి ప్రయత్నమే బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ఆ తర్వాత గీతగోవిందం- సరిలేరు నీకెవ్వరు- భీష్మ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. ప్రస్తుతం బన్ని సరసన పుష్పలో నటిస్తున్నారు. ఈలోగానే నేషనల్ క్రష్ గా పాపులారిటీ దక్కింది. ఇదే అదనుగా అటు హిందీ.. తమిళ చిత్రసీమలోనూ రష్మిక అడుగు పెట్టేయనుంది. తదుపరి శంకర్ - చరణ్ సినిమాలోనూ నాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది.
హిందీలోకి డబ్బింగులు వెళుతున్నాయి కాబట్టి వాటితోనే రష్మికకు అక్కడ బోలెడంత పాపులారిటీ వచ్చేసింది. ఆ క్రమంలోనే తాను హిందీలోనూ నటించేస్తోంది. ``ప్రజలు ఇకపై జాతీయ సినిమా మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ను చూసేందుకు అలవాటు పడుతున్నారు. నేను ఏ భాషలోనైనా మంచి పాత్రల్ని చేయాలనుకుంటున్నాను. దక్షిణాది ఉత్తరాది అనే అంతరాలు లేకుండా అన్నిచోట్లా నేను పరిచయం అయిపోవాలనుకున్నాను. అందుకే హిందీలోనూ నటిస్తున్నాను అని తెలిపారు రష్మిక. భాషా భేధంతో పని లేకుండా అన్ని భాషల ప్రజలు అన్ని రకాల సినిమాల్ని ఆస్వాధిస్తున్నారని తెలిపారు. ఇది కొత్త పరిణామమని కూడా అన్నారు.