లాహిరి లాహిరి లాహిరిలో అంటూ టాలీవుడ్ మూవీతో తెరంగేట్రం చేసిన భామ అంకితా జవేరి. తన చిన్న వయసులో చేసిన రస్నా యాడ్ తో ఈ భామ జనాలకు ముందే పరిచయం. ఐ లవ్యూ రస్నా అంటూ అలరించిన తీరు జనాలకు బాగా నచ్చేసింది. టాలీవుడ్ లో సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్స్ లో కూడా నటించిన అంకిత.. కన్నడ.. తమిళ్ చిత్రాల్లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిచింది.
సినిమాల కౌంట్ తక్కువగా ఉన్నా.. మంచి సినిమాల్లో నటించిందనే గుర్తింపు సంపాదించిన అంకిత.. గతేడాది పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. విశాల్ జగపత్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడిన అంకిత.. ప్రస్తుతం అమెరికాలోనే ఉంటోంది. వీరికి రీసెంట్ గా ఓ పండంటి బాబు పుట్టాడు. ఈ చిన్నారికి నీల్ అని పేరుకున్నారని తెలుస్తోంది. తన భర్తతో కలిసి కొడుకును అభిమానులకు చూపించింది. ముద్దులొలికే ఈ చిన్నారి ఫోటో.. వీడియో ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
రస్నాపాప కొడుకు కావడంతో.. జనాలు కూడా ఈ చిన్నారిని ఆసక్తిగా చూస్తున్నారు. రోజుల పిల్లాడిని ఇలా మీడియాకు చూపించే ధైర్యం చేయడాన్ని మాత్రం అందరూ ప్రశంసిస్తున్నారు. తన ముద్దుల కొడుకుతో అంకిత మాట్లాడుతున్న మాటలు భలే ముచ్చటగా ఉన్నాయి.