మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలయ్యేందుకు ముహుర్తం దగ్గరపడుతోంది. ఏప్రిల్ 29న ముహూర్తం షాట్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్ లో.. కోలీవుడ్ మూవీ కత్తిని తెలుగులో రీమేక్ చేయనున్నారు మెగాస్టార్.
కత్తిలాంటోడు అనే టైటిల్ ని పరిశీలిస్తుండగా.. ఇప్పుడు చిరంజీవి రీఎంట్రీని గ్రాండ్ లెవెల్ లో చూపించగల సినిమాటోగ్రాఫర్ ఎంపిక పూర్తయింది. అప్పట్లో ఆర్య.. మొన్న రోబో - 1 నేనొక్కడినే - కుమారి 21 ఎఫ్ లతో ట్యాలెంటెడ్ టెక్నీషియన్ అనిపించుకున్న రత్నవేలును.. ఎంపిక చేశారు. డైరెక్టర్ ఆలోచనను పక్కాగా తెరకెక్కించడంలో.. సినిమాటోగ్రాఫర్ చాలా ముుఖ్యం. అందుకే చాలామంది ప్రొఫైల్స్ ను పరిశీలించాక.. రత్నవేలు అయితే తనను పర్ఫెక్ట్ గా పిక్చరైజ్ చేయగలనని నమ్మారట చిరు.
ప్రస్తుతం కత్తి రీమేక్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. మహూర్తం షాట్ తర్వాత.. ఇతర టెక్నీషియన్స్ ఎంపిక చేయనుండగా.. చిరుతో కలిసి చిందేయడానికి సౌత్ క్వీన్ నయనతారను ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత కాగా.. చెర్రీ తల్లి సురేఖ - లైకా ప్రొడక్షన్స్ లు సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నాయి.