సమంత అందాన్ని అలా తగ్గించారట..

Update: 2018-03-30 07:20 GMT
ఒకప్పటి హీరోయిన్లయితే పల్లెటూరి అమ్మాయి పాత్రల్ని చాలా తేలిగ్గా చేసుకెళ్లిపోయేవాళ్లు. కానీ ఇప్పటి హీరోయిన్లను అలాంటి పాత్రల్లో చూపించడం అంత తేలిక కాదు. చాలా మంది స్టార్ హీరోయిన్లు పల్లెటూరి అమ్మాయిల పాత్రలకు సెట్టవ్వరు. అసలు ఈ రోజుల్లో పల్లెటూరి నేపథ్యంలో సినిమాలే తగ్గిపోయాయి. దర్శకులకే ఆ నేపథ్యంలో సినిమాలు చేయడం చేత కావట్లేదు. ఇక హీరోయిన్లను పల్లెటూరి పాత్రల్లో చూపించడమంటే మాటలు కాదు. ఐతే పల్లెటూరి నేపథ్యం నుంచే వచ్చిన సుకుమార్ మాత్రం ‘రంగస్థలం’ రూపంలో అచ్చమైన పల్లె సినిమా చేశాడు. ఇందులో కథానాయిక సమంతను పక్కా పల్లెటూరి పిల్ల లాగా చూపించాడు. అందరితోనూ ఆమోద ముద్ర వేయించుకున్నాడు.

ఐతే సమంతను విలేజ్ అమ్మాయిగా చూపించే విషయంలో చాలా కసరత్తే జరిగిందట. మంచి రంగులో ఉండే సమంతను ఎండల్లో కష్టపడే పల్లెటూరి అమ్మాయిలా సహజంగా చూపించడం కోసం ఒక వెరైటీ మేకప్ ట్రై చేయించాడట కెమెరామన్ రత్నవేలు. మామూలుగా హీరోయిన్లకు వేసే మేకప్ మెటీరియల్లోకి బ్రౌన్ కలర్ మిక్స్ చేయించాడట రత్నవేలు. ఆ రంగు కలిపి మేకప్ వేయడం వల్ల ట్యాన్ లుక్ వచ్చిందట. అది చాలా సహజంగా ఉన్నట్లుగా కుదిరిందట. సమంత కొంచెం సందేహంగానే ఈ మేకప్ వేసుకుందని.. కానీ షాట్ తీశాక మానిటర్లో చూసుకుని ఫిదా అయిపోయిందని రత్నవేలు చెప్పాడు. అది సూపర్ గా ఉందని.. మీరు ఎలా చెబితే అలా చేస్తానంటూ రెడీ అయిందని.. ఆ రకంగా సమంత అందాన్ని తగ్గించి.. రామలక్ష్మి పాత్రకు సహజత్వం తీసుకొచ్చామని రత్నవేలు తెలిపాడు.
Tags:    

Similar News