మ‌హేష్ 26 కి రోబో ర‌త్న‌వేలు విజ‌న్!

Update: 2019-07-14 04:15 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. అనీల్ రావిపూడి బృందం సైలెంట్ గా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ సాగిస్తున్నారు. ఇటీవ‌లే మ‌హేష్ క‌శ్మీర్ లో షెడ్యూల్ కి అటెండ‌య్యారు. క‌శ్మీర్ నుంచి ఆంధ్రాకి ప్ర‌యాణించే రైలులో ఆర్మీ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నారని ప్ర‌చార‌మైంది. ఆర్మీ అధికారిగా మ‌హేష్‌ లుక్ ఇప్ప‌టికే లీకై అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచింది. మేజ‌ర్ అజ‌య్ కృష్ణ‌గా మ‌హేష్ నటిస్తున్నార‌ని అనీల్ రావిపూడి స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల ద్వారా రివీల్ చేయ‌డంతో క్యూరియాసిటీ పెరిగింది.

మ‌హేష్ కెరీర్ లో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రాహ‌కుడు ఎవ‌రు? అంటే ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన క్లూ ఏదీ అంద‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాకి మ‌హేష్ ఫేవ‌రెట్ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు ప‌ని చేస్తున్నార‌ని తెలుస్తోంది. ర‌త్న‌వేలు ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న సైరా చిత్రానికి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తయ్యింది కాబ‌ట్టి పూర్తిగా స‌రిలేరు... టీమ్ కి అందుబాటులోకి వ‌చ్చార‌ని తెలిసింది. 

ర‌త్న‌వేలు జాతీయ స్థాయి అత్యుత్త‌మ ఛాయాగ్రాహ‌కుడు అన‌డంలో సందేహం లేదు. ఆర్య‌- రోబో- కుమారి 21 ఎఫ్‌- ఖైదీనంబ‌ర్ 150- సైరా లాంటి క్రేజీ చిత్రాల‌కు ప‌ని చేశారు. మ‌హేష్ తో బ్ర‌హ్మోత్స‌వం-1-నేనొక్క‌డినే చిత్రాల‌కు ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం అందించారు. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌హేష్ 26వ సినిమాకి ప‌ని చేస్తున్నార‌న్న‌ది ఆ టీమ్ కి శుభ‌వార్త‌నే. చాలా సంద‌ర్భాల్లో ర‌త్న‌వేలు త‌న ఫేవ‌రెట్ సినిమాటోగ్రాఫ‌ర్ అని వేదిక‌ల‌పైనే పొగిడేసిన మ‌హేష్ కి మ‌రోసారి త‌న‌తోనే ప‌ని చేసే అవ‌కాశం రావ‌డం హ్యాపీ మూవ్ మెంట్ అనే చెప్పాలి. స‌రిలేరు చిత్రానికి భారీ సెట్ వ‌ర్క్ తో పాటు.. సీజీ వ‌ర్క్ అవ‌స‌రం ఉంద‌ని తెలుస్తోంది. అలాంటి సినిమాకి ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అనుభ‌వం పెద్ద ప్ల‌స్ కానుంది. భారీ వీఎఫ్ ఎక్స్ అవ‌స‌రం ఉన్న సినిమాల‌కు ప‌ని చేసిన అనుభ‌వం అత‌డి సొంతం కాబ‌ట్టి ఇది స‌రిలేరు బృందానికి పెద్ద ప్ల‌స్. చిత్ర‌యూనిట్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.


Tags:    

Similar News