రావణాసుర కలెక్షన్స్... ఈరోజు మిస్సయితే కష్టమే!

Update: 2023-04-09 12:18 GMT
రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మానుయేల్ నటించగా దక్ష నాగర్కర్, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా వంటి వారు నటించారు.

ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాల‌నే అత‌డి క‌ల తీర‌లేదనే చెప్పాలి. తొలిరోజు ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. అయితే రావ‌ణాసుర‌ ఉన్న బ‌జ్‌ కార‌ణంగా ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్‌ను భారీగానే రాబ‌ట్టారు. మొదటి రోజు నాలుగు కోట్ల గ్రాస్‌ ను 29 లక్షలు షేర్‌ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. రెండో రోజు 2 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. రెండో రోజు కలెక్షన్స్ వివరాలు ఒకసారి చూస్తే...

రావణాసుర ఆంధ్ర, తెలంగాణలో కలెక్షన్స్ ఇలా
మొదటి రోజు :  4.29 కోట్లు
 రెండో రోజు : 2.25 కోట్లు
AP-TG మొత్తం:- 6.54 కోట్లు (10.75 కోట్ల గ్రాస్)


రావణాసుర 2 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇలా...

నైజాం: 2.53 కోట్లు

సీడెడ్: 1.12 కోట్లు

ఉత్తర ఆంధ్ర: 97 లక్షలు

ఈస్ట్: 49 లక్షలు

వెస్ట్: 32 లక్షలు

గుంటూరు: 57 లక్షలు

కృష్ణ: 32 లక్షలు

నెల్లూరు: 22 లక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం:- 6.54 కోట్లు(10.75 కోట్లు గ్రాస్)

ఇతర భాషలలో - 0.56 కోట్లు

ఓవర్సిస్ - 0.70 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా – 7.80 కోట్లు (13.70 కోట్లు గ్రాస్)

అలా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల 80 లక్షల షేర్, 13 కోట్ల 70 లక్షల గ్రాస్ సాధించింది. ఇక ఈ వీకెండ్ ఆదివారం రోజు ఎలాగైనా సినిమాకు కాస్త వసూళ్లు వస్తే. నష్టాల్లోకి రాకుండా ఉంటుంది. లేదంటే ఆ తర్వాత గట్టెక్కడం కష్టమేనని సినీ వర్గాల టాక్. చూడాలి మరి ఏమవుతుందో.

Similar News