ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నవదీప్ పేరు నలుగుతూ ఉంటుంది. తాజాగా మరో వివాదం ఆయన్ని చుట్టుముట్టింది. తన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ చేసుకొన్నాడని, ఆ సమయంలోనే పోలీసులు దాడులు చేశారని, కానీ నవదీప్ అక్కడ్నుంచి తప్పించుకొన్నాడన్నది తాజా వివాదం. నవదీప్ పరారీలో ఉన్నాడని కూడా మీడియాలోనూ వార్తలొస్తున్నాయి. అయితే నవదీప్ మాత్రం ఆ ఆరోపణల్ని తోసిపుచ్చతున్నాడు. మీరు నా పేరు వాడిన ప్రతిసారీ ఒక్కో రూపాయి ఇచ్చినా నేను ఫామ్ హౌస్ కొనగలిగేవాడినేమో అన్న ఆయన.. ఎలాగో వీడి మీద చాలానే ఉన్నాయి కదా. మరొకటి వేసేద్దామని అనుకుంటున్నరన్న అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఫ్యామిలీతో కలిసి డిన్నర్ కి వెళ్తే.. రేవ్ పార్టీలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి..ఆ రేవ్ పార్టీతో నాకేంటో సంబంధం? వాడు చెప్పాడని.. వీడు రాశాడని.. ఇంకొకడు రాశాడంట.. దేశానికి నేను ఎలాగూ పనికిరానని మీ ఫిలింగ్ కదా. ఫోనీలే.. మీరైనా పనికి రండి. నన్ను పక్కన పెట్టి పనికొచ్చే పని చేయండి. పెద్దలు.. కుటుంబంతో కలిసి గడిపిన ఒక గృహప్రవేశాన్ని రేవ్ పార్టీ చేసిన మహానుభావులకు పాదాభివందనాలు’’ అంటూ చురకలేసే ప్రయత్నం చేశారు.
యువ కథానాయకుల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నవదీప్ ఇదివరకు పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. కానీ ఇటీవల చెన్నై వరద బాధితుల కోసం నవదీప్ ముందుండి పునరావాస కార్యక్రమాలు చేపట్టాడు. బాధితుల కోసం పెద్దయెత్తున నిత్యావసరాలు సేకరించి చెన్నైకి పంపించాడు. ఆయన కృషిని పలువురు అభినందించారు. నవదీప్ మంచి పనుల్లోనూ ముందుంటాడని అందరూ కొనియాడారు. కానీ ఇంతలో ఆయనపై రేవ్ పార్టీ ఆరోపణలు రావడం గమనార్హం. మరి ఇందులో వాస్తవమెంతన్నది పోలీసులే తేల్చాలి.