ఆరిపోయిన చిచ్చు రాజేసి చలి కాచుకుందామని ట్రై చేసినట్లుగా అయిపోయింది అమీర్ ఖాన్ పరిస్థితి. ఇండియా వదిలి వెళ్లిపోవాలా అని తన భార్య అడిగిందని చెప్పాడు కానీ.. ఇవి అమీర్ భార్య కిరణ్ కామెంట్స్ గా ఎవరూ తీసుకోవడం లేదు. అమీర్ ఖాన్ సొంత అభిప్రాయాన్నే తన భార్య పేరుపై చెప్పాడని భావిస్తున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూడా అమీర్ పై విరుచుకుపడింది.
అమీర్ కామెంట్స్, ఆ తర్వాత ముందు పరిస్థితులపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది రవీనా. నరేంద్ర మోడీ ఇండియా ప్రధాని కావడం ఇష్టం లేని వాళ్లంతా కలిసి.. ఇపుడు ఇండియా పరువు తీసే పని పెట్టుకున్నారని తేల్చేసింది. ఇందుకు ఒక న్యూస్ లింక్ ను కూడా షేర్ చేసింది. అమెరికా వీసా వివాదంపై ఓ పదేళ్ల క్రితం నరేంద్రమోడీకి వ్యతిరేకంగా అప్పటి ప్రధాని మోడీకి రాసిన లేఖ అది. అందులో మొదటి పేరు అమీర్ ఖాన్ దే ఉండడం విశేషం. అయితే ఇది నిజమో కాదో తనకు తెలీదని చెప్పిన రవీనా.. అమీర్ వ్యాఖ్యలపై మాత్రం భగ్గుమంది.
"మోడీ ప్రధాని అయ్యాక పరిస్థితులతో, ఇండియాలో బతకలేమని అనేవారు.. ముంబై దాడులప్పుడు ఏమయ్యారు. ముంబైపై బాంబు దాడుల సమయంలో ఏమైపోయారు..." అని నేరుగా ప్రశ్నించింది రవీనా. ఇండియా నీకు చాలా ఇచ్చింది.. నువ్వు ఇండియాకి ఏమిచ్చావ్ అని ప్రశ్నించుకోమంటూ అగ్గిమీద గుగ్గిలం అయింది రవీనా. ఈ సీనియర్ భామ అడిగింది కూడా ఓ కొత్త పాయింట్ కదూ.