'కేజీఎఫ్ 2' లో బాల‌య్య హీరోయిన్

Update: 2019-02-26 15:59 GMT
య‌శ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్ -చాప్ట‌ర్ 1 సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 250 కోట్లు వ‌సూలు చేయ‌గా కేవ‌లం క‌న్న‌డ లోనే 100కోట్లు వ‌సూలు చేసింది. బాలీవుడ్ నుంచి 50 కోట్ల వ‌ర‌కూ రాబ‌ట్టింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాని భారీ కాన్వాసుపై తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం  శాండల్ వుడ్ - బాలీవుడ్ స్టార్ల క‌ల‌యిక‌లో అత్యంత భారీగా తెర‌కెక్క‌నుంది. ఇప్ప‌టికే కాస్టింగ్ సెల‌క్ష‌న్స్ సాగుతున్నాయి.

చాప్ట‌ర్ 1లో ఛాన్స్ వ‌చ్చినా మున్నాభాయ్ సంజ‌య్ ద‌త్ అప్ప‌ట్లో కాద‌నుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ఎట్టి ప‌రిస్థితిలో మిస్ చేసుకునే ఆలోచ‌న‌లో లేరు. ఇటీవ‌లే కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 చిత్రంలో న‌టించేందుకు అంగీక‌రించార‌ని వార్త‌లొచ్చాయి. సంజూ భాయ్ తో పాటు ప‌లువురు బాలీవుడ్ స్టార్ల‌ను ఈ చిత్రంలో న‌టింప‌జేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

ఈ ప్ర‌య‌త్నాల్లో భాగంగా బాలీవుడ్ సీనియ‌ర్ నాయిక ర‌వీనా టాండ‌న్ ని ఒప్పించేందుకు ప్ర‌య‌త్నం సాగుతోంది. వాస్త‌వానికి `కేజీఎఫ్ చాప్ట‌ర్ -1` చిత్రాన్ని బాలీవుడ్ లో రిలీజ్ చేసి భారీగా లాభాలార్జించిన ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ అనీల్ త‌డానీ వైఫ్ ర‌వీనా టాండ‌న్. బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా సీక్వెల్ లో న‌టించడానికి అభ్యంతరం ఉంటుందా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ర‌వీనాతో పాటు ప‌లువురు టాప్ స్టార్ల‌ను బ‌రిలో దించి `కేజీఎఫ్ - చాప్ట‌ర్ 2`లో వేడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ర‌వీనా ఇదివ‌ర‌కూ నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న `బంగారు బుల్లోడు`లో.. క‌న్న‌డ హీరో ఉపేంద్ర స‌ర‌స‌న ఉపేంద్ర చిత్రంలో న‌టించారు. ప్ర‌స్తుతం కేజీఎఫ్ తో మరోసారి స్ట్రైక్ బ్యాక్ కాబోతున్నారు. ఈ సిరీస్ ని పాన్ ఇండియా సినిమాగా మార్చేందుకు ఇరుగు పొరుగు భాష‌ల నుంచి స్టార్ల‌ను ఎంపిక చేసుకునే ఆలోచ‌న‌లోనూ ఉన్నార‌ట‌. బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ సౌత్ నుంచి ద‌మ్మున్న ఫ్రాంఛైజీగా `కేజీఎఫ్` సిరీస్ నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News