తెలుగులో వెరైటీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాడు రవిబాబు. నటుడిగా అతను చేసే సినిమాలకు.. దర్శకుడిగా అను తీసే సినిమాలకు పోలిక ఉండదు. తొలి సినిమా ‘అల్లరి’ నుంచే వైవిధ్యమైన ప్రయాణం సాగిస్తున్నాడతను. తర్వాత ‘నచ్చావులే’.. ‘అనసూయ’.. ‘అమరావతి’.. ‘అవును’ లాంటి భిన్నమైన సినిమాలతో పలకరించిన రవిబాబు.. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఒక పంది పిల్లను హీరోగా పెట్టి ‘అదుగో’ అనే సినిమా తీశాడు. ఇది ఎవ్వరూ ఊహించని సినిమా. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఒకటి రాలేదు. అసలు ఇండియాలోనే పంది హీరోగా సినిమా ఎవ్వరూ తీయలేదు. మరి ఈ ఆలోచన రవిబాబుకు ఎందుకు వచ్చింది..? ఈ ప్రశ్నకు రవిబాబే సమాధానం చెప్పాడు.
అదుగో’ సినిమా కోసం రెండేళ్లు నటనకు దూరంగా ఉన్నా. ఈ గ్యాప్ లో చాలా అవకాశాలొచ్చినా చేయలేకపోయా. ప్రస్తుతం నన్ను అందరూ మరచిపోయారని కొందరు అంటున్నారు. ‘అదుగో’ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర చేశా’’ అని రవిబాబు అన్నారు. పంది పిల్ల (బంటి) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అదుగో’. రవిబాబు - అభిషేక్ - నభా ముఖ్య పాత్రలు చేశారు. నిర్మాత సురేశ్‌బాబు సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ లో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. రవిబాబు చెప్పిన విశేషాలు.
‘‘డిస్నీ సినిమాల స్ఫూర్తితో ఓ జంతువు లీడ్ రోల్ లో సినిమా తీయాలనిపించింది. హాలీవుడ్ మూవీ ‘ప్లా నెట్ ఆఫ్ ఆది ఏప్స్’ నాకెంతో ఇష్టం. నాకూ కోతులతో సినిమా తీయాలనిపించింది కానీ.. బడ్జెట్ ఇబ్బందుల కారణంగా కోతులతో తెలుగులో సినిమా చేయడం సాధ్యం కాదు. ఏనుగు.. ఈగ.. ఎలుక.. కుక్క.. ఇలా చాలా జంతువులతో మనవాళ్లు సినిమాలు చేశారు. పందితో హాలీవుడ్ లో సినిమాలొచ్చాయి. కానీ, ఇండియాలో రాలేదు. అందుకే పందిని కథా వస్తువుగా ఎంచుకున్నా. పెద్దల మాట వినకుండా బయటి ప్రపంచంలో అడుగుపెట్టిన ఓ పందిపిల్లకు ఒక రోజులో ఎదురైన సంఘటనలను వినోదాత్మకంగా చూపించాం. ఇందులో ప్రతి పాత్రా వినోదం పంచుతుంది. కమర్షియల్ గా ‘అదుగో’ రిస్క్ తో కూడుకున్నది. ఐతే ప్రతిసారీ కొత్త కథతో తొలి సినిమాలా భావించి ప్రేక్షకుల్లోకి తీసుకురావడా నికి శ్రమిస్తుండటంతో ఆ కష్టం అలవాటైపోయింది’’ అని రవిబాబు చెప్పాడు. ‘అదుగో’లో పంది పిల్లకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రాజేంద్రప్రసాద్ భయపడ్డా.. తాను కష్టపడి ఒప్పించినట్లు రవిబాబు చెప్పాడు.