రేసుగుర్రం సినిమా అంత పెద్ద హిట్టవ్వడానికి రెండు కారణాలు. ఒకటి బన్ని-కిక్‌శ్యామ్ మధ్య హోరాహోరీ, రెండోది బన్ని - విలన్ రవికిషన్ మధ్య టిట్ ఫర్ టాట్. జనాలకు ఇవి రెండూ పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. అటు అన్న శ్యామ్‌తో, ఇటు విలన్ రవికిషన్ తో బన్నీ గిల్లికజ్జాలు సూపర్భ్. ఆ మూడు క్యారెక్టర్లకు లంకె వేసి వక్కంతం వంశీ అండ్ సురేందర్ రెడ్డి అద్భుతంగా స్క్రీన్ ప్లే ని తీర్చిదిద్దారు. అందుకే అంత పెద్ద హిట్టయ్యింది.
ముఖ్యంగా బన్నీతో పోటీపడుతూ బోజ్ పురి విలన్ రవికిషన్ అసాధారణంగా నటించాడు. నువ్వు మొండి అయితే నేను జగమొండి అన్న తీరుగా రవికిషన్ అభినయం పరాకాష్ట. అందుకే అతడిని తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నారు. రవికిషన్ నటించిన మరో సినిమా కిక్2 కూడా థియేటర్లలోకి రిలీజైంది. ఈ సినిమా జనాలకు నచ్చినా నచ్చకపోయినా ఇందులో రవికిషన్ మాత్రం అందరికీ నచ్చాడు. అతడి ఎక్స్ ప్రెషన్ బాడీ లాంగ్వేజ్ నచ్చింది. అందుకే ఇప్పుడు అతడు బాలయ్యబాబు 'డిక్టేటర్'లో విలనీ చేస్తున్నాడని తెలియగానే ఓ కొత్త ఉత్సాహం.
మాస్ మసాలా డిక్టేటర్ తో పోటీపడుతూ హోరాహోరీగా కనిపించే విలన్ గా రవికిషన్ మరోసారి నిరూపించుకుని తీరతాడు. అతడి వల్ల సినిమాకి పెద్ద ప్లస్ అవ్వడం ఖాయం. దటీజ్ రేసుగుర్రం విలన్. అయితే ఇందుకు లక్ కూడా కావాలి. కిక్ 2 సినిమాలో ఇదే విలన్ సోలమాన్ సింగ్ థాకూర్ గా చేస్తే.. దానికి అంతగా కిక్ రాలేదు మరి. లెటజ్ సీ.