బొమ్మాళీ గొంతులో వర్మ ఎన్టీఆర్ గర్జన

Update: 2019-02-11 11:15 GMT
తన లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రమోట్ చేసుకునే విషయంలో రామ్ గోపాల్ వర్మ ఎక్కడా తగ్గడం లేదు. రోజుకో రకమైన పబ్లిసిటీతో సోషల్ మీడియాలో టాపిక్ గా నిలుస్తున్నాడు. రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతున్నా అది తనకోసమే అనేలా చెప్పుకుంటున్న వర్మ ఆఖరికి నిన్న మోడీ మాటలను కూడా తనకు అనుకూలంగా వీడియో కట్ చేయించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ సాంగ్ లైవ్ రికార్డింగ్ ని వీడియో రూపంలో పోస్ట్ చేసాడు వర్మ.

సాయి కుమార్ తమ్ముడు సుప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి శంకర్ గంభీరమైన గొంతుతో హై పిచ్ లో గర్జన సింహ గర్జన అంటూ పాడుతుంటే పక్కన సంగీత దర్శకుడు కళ్యాణి  మాలిక్ ఉత్సాహంతో ఊగిపోవడం బాగా హై లైట్ అయ్యింది. కేవలం నిమిషంలోపే ఈ ఉన్న వీడియోతో పాటు రవి శంకర్ ను పొగుడుతూ ఈ గొంతులోని పవర్ స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కు సైతం వినపడుతుందని గొప్పగా వర్ణించాడు. గీత రచయిత సిరాశ్రీకు ప్రత్యేక అభినందనలు పొందుపరిచాడు. రవి శంకర్ అరుందతిలో విలన్ సోను సూద్ కు డబ్బింగ్ చెప్పాక బాగా పాపులర్ అయ్యాడు

అసలు రవి శంకర్ తో పాడించాలి అనే ఐడియా ఎలా వచ్చిందో కాని ఎంతో కొంత వర్క్ అవుట్ అయ్యేలాగే ఉంది. ట్యూన్ చాలా గంభీరంగా మంచి ఎనర్జీతో ఉంది. సిరాశ్రీ పదాలు కూడా డెప్త్ గానే అనిపిస్తున్నాయి. సాహిత్యాన్ని బట్టి చూస్తే ఇది  గద్దె దింపాక చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ చేపట్టిన ఉద్యమం తాలుకు బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లాగా తోస్తోంది. మొత్తానికి వర్మ ఎత్తులు బాగానే వర్క్ అవుట్ అవుతున్నట్టు అనిపిస్తోంది. మరి ఈ సింహ గర్జన ఫుల్ సాంగ్ వస్తే కాని పూర్తి క్లారిటీ రాదు. చూద్దాం
    

Tags:    

Similar News