రవితేజ ఒకప్పుడు వరుస ఫ్లాపులతో దెబ్బతిన్నాడు. మొన్న విడుదలైన రాజా దిగ్రేట్ హిట్ తో కాస్త పుంజుకుని తిరిగి వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడులో నటిస్తున్నాడు. బెంగాల్ టైగర్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ... ఆ గ్యాప్‌లో కాస్త సన్నబడ్డాడు. ఎంతగా అంటే అభిమానులకే నచ్చనంతగా.
హీరోయిన్ సన్నగా ఉంటే బాగుంటుంది. కానీ హీరో కండల వీరుడిలా ఉంటేనే మ్యాన్లీగా ఉండేది. కానీ రవితేజ సన్నగా అవ్వాలన్న తహతహతో... పీలగా అయిపోయాడన్న టాక్ వినిపిస్తోంది. ముఖంలో ఉన్న కాస్త కళ కూడా పోయిందని బాధపడుతున్న మాస్ మహారాజా అభిమానులు. ఈ విషయాన్ని ఆగలేక ఒక వ్యక్తి ట్విట్టర్ లో అడిగేశాడు. దానికి మాస్ మహారాజా కూడా ధీటుగానే సమాధానం ఇచ్చాడు. కడపకింగ్ అని ఖాతా తెరిచిన ఒక వ్యక్తి - రవితేజని అడగండి... ఎందుకంత సన్నగా అయిపోయాడో అని ట్వీటు చేశాడు. దానికి రవితేజ ''సన్నగా అయితే సన్నగా అయిపోయారు అంటారు... లావైతే లావైపోయారు అంటారు'' అని తన ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెట్టాడు. అంతే తప్ప తాను పీలగా అయిపోయానని మాత్రం ఒప్పుకోడు.
ఫిబ్రవరి2 టచ్ చేసి చూడు థియేటర్లలోకి వస్తోంది. దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. తాను మళ్లీ ట్రాక్ ఎక్కడానికి ఈ సినిమా హిట్ కొట్టడం చాలా ముఖ్యమని భావిస్తున్నాడు. విక్రమ్ సిరికొండ ఈ సినిమా దర్శకుడిగా ఉన్నాడు. కాగా ఇటీవలే రవితేజ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఎప్పటికైనా తాను మెగా ఫోన్ పట్టుకుంటానని, ఆ సినిమాలో తాను మాత్రం నటించనని చెప్పాడు. అయితే దర్శకత్వం వైపు వెళ్లడానికి ఇంకా సమయం పడుతుందని, ప్రస్తుతం హీరో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు.