మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా తో మళ్లీ గాడిన పడ్డట్లే అని అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో రవితేజ నుండి తదుపరి రాబోతున్న ధమాకా సినిమా ఎలా ఉంటుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ధమాకా సినిమా మాత్రమే కాకుండా రవితేజ ఇప్పటికే కమిట్ అయ్యి షూటింగ్ కూడా జరుపుతున్న సినిమాలు మరో రెండు మూడు ఉన్నాయి. అంతే కాకుండా వాల్తేరు వీరయ్య సినిమా లో కీలకమైన గెస్ట్ రోల్ లో రవితేజ నటించిన విషయం తెల్సిందే. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ సమయంలో గెస్ట్ రోల్స్ అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
ఈ సమయంలోనే రవితేజ నిర్మాతగా కూడా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ను కొందరు తప్పు బడుతున్నారు. తమిళ స్టార్ విష్ణు విశాల్ హీరోగా రూపొందిన మట్టి కుస్తీ కి రవితేజ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. హీరోగా సక్సెస్ లు లేక ఇబ్బందులు పడుతున్న రవితేజ ఇలా నిర్మాణం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఏంటో అంటూ కొందరు ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రవితేజ రావణాసుర మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలపై కూడా ఆసక్తి నెలకొంది. ధమాకా సినిమాలు సక్సెస్ అయితేనే రవితేజ తదుపరి సినిమాల కు బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. హీరోగా మరి కొంత కాలం రవితేజ కెరీర్ ను కంటిన్యూ చేయాలి అంటే కచ్చితంగా కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టాలి అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమయంలో రవితేజ నిర్మాణం.. గెస్ట్ రోల్స్ జోలికి పోకుండా హీరోగా తాను చేస్తున్న సినిమాలపై దృష్టి పెడితే బెటర్ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.