రోడ్డు ప్రమాదం మరో ప్రముఖుడి ఇంట విషాదాన్ని నింపింది. మృత్యుముఖంగా మారిన అవుటర్ రింగ్ రోడ్డు మీద కారులో ప్రయాణిస్తున్న ప్రముఖ టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడి ప్రాణాల్ని తీసింది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ప్రమాదం వివరాల్లోకి వెళితే..
శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆగి ఉన్న లారీని ఒక ఖరీదైన కారు ( లగ్జరీ స్కోడా ఆక్టావియా ) బలంగా ఢీ కొంది. ఈ కారు ఎంత వేగంగా ఢీ కొందంటే.. కారు మూడు వంతులకు పైగా లారీ లోపలకు దూసుకెళ్లింది. అతి వేగంతో ఉండటం.. కారుకు రక్షణగా ఉన్న ఎయిర్ బెలూన్లు పేలిపోవటంతో.. కారులో ఉన్న హీరో రవితేజ సోదరుడు భరత్ ఘటనాస్థలంలోనే మరణించారు. ఆయన వయస్సు 52 సంవత్సరాలు.
అయితే.. భరత్ మరణాన్ని అతని స్నేహితులు రహస్యంగా ఉంచారు...అయితే.. చనిపోయింది భరత్ అని తెలుసుకునేందుకు పోలీసులకు సదరు స్కోడా కారు డిటైల్స్ తెలిసే వరకు సమయం పట్టింది. కారు భరత్ తల్లి రాజ్యలక్ష్మి పేరు మీద ఉండటం వలన.. చనిపోయింది ఎవరో కనిపెట్టడానికి పోలీసులకు దాదాపు 12 గంటల పట్టిందని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే.. రోడ్డు మీద ఆపిన లారీని అక్రమంగా ఆపారని చెబుతున్నారు. ఎందుకంటే.. లారీ చెడిపోవటంతో రోడ్డు మీద ఆపేశారు. కేవలం చెట్టు కొమ్మలు మాత్రమే ఉంచారు తప్పించి.. ఎలాంటి ఇండికేటర్లు ఏర్పాటు చేయలేదు. చీకటిలో ఎదురుగా ఉన్నది లారీ అన్నది గుర్తించటంలో జరిగిన పొరపాటు.. ప్రాణాలు పోయేంత పెను ప్రమాదంగా మారిందని చెబుతున్నారు.
వాస్తవానికి ప్రమాదం జరిగింది నిన్న (శనివారం) రాత్రే అయినా.. మృతుడ్ని గుర్తించటంలో జరిగిన ఆలస్యంతో ఉదయం కానీ బయటకు రాలేదు. ప్రమాదంలో ఒకరు చనిపోయినట్లుగా పోలీసులకు తెలీటం.. కారు నెంబరును చూసినప్పుడు ప్రముఖుల పేర్లతో లేకపోవటంతో మామూలు ప్రమాదంగానే భావించినట్లుగా తెలుస్తోంది. అయితే.. కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా సమాచారాన్ని బాధిత కుటుంబానికి పోలీసులు తెలియజేసే సమయంలోనే చనిపోయింది హీరో రవితేజ సోదరుడిగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ఇకపోతే భరత్ పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన భరత్, తెలుగు సిసీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్, వెంకీ, దూకుడు లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. గతంలో పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది. డ్రగ్స్ కేసుల విషయంలో ఆయన పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం.. అక్కడ ఆయన్ను ఫోటోలు తీస్తున్న మీడియాపై సీరియస్ అవ్వడం వంటి విషయాలు తెలిసిందే.