రవితేజ తమ్ముడు భరత్ దుర్మరణం పాలవడం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వాళ్లనే కాక.. అందరినీ బాధపెట్టింది. ముందు అతడి మృతిని తేలిగ్గా తీసుకున్నారు కానీ.. చనిపోవడానికి కొన్నేళ్ల ముందు నుంచి భరత్ జీవితం ఎన్నెన్ని మలుపులు తిరిగిందో తెలిశాక అతడి గురించి అందరూ బాధపడుతున్నారు. అమెరికాలో భార్యతో కలిసి చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నవాడు.. ఎవరో దర్శకుడు అవకాశమిస్తానన్నాడని ఇక్కడికి రావడం.. ఆ దర్శకుడు హ్యాండిస్తే చిన్నా చితకా వేషాలేయడం.. తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం.. తప్పుదోవ పట్టడం.. చివరికి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోవడం.. ఇలా అతడి కథ అనూహ్య రీతిలో ముగిసింది.
ఐతే భరత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు అతడి జీవితం మలుపు తిరిగే ఆఫర్ వచ్చిందట. ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా ఛానెల్ వాళ్లు భారీ స్థాయిలో లాంచ్ చేస్తున్న మెగా రియాల్టీ షో ‘బిగ్ బాస్’లో పార్టిసిపెంట్ గా పాల్గొనమని భరత్ కు ఆహ్వానం పలికారట. అతను సానుకూలంగానే స్పందించాడట. కాస్త వివాదాస్పద నేపథ్యం ఉన్న భరత్ లాంటి వాళ్లే ‘బిగ్ బాస్’ షోకు అవసరం. భరత్ కు కూడా ఈ షోలో పాల్గొని ఉంటే బాగానే ఉండేది. మంచి పారితోషకం లభించేది. ఫేమ్ కూడా వచ్చేది. ఈ షో తర్వాత అతడి కెరీర్ టర్నయ్యేదేమో కూడా. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. భరత్ ప్రాణాలు కోల్పోయాడు. విధి వక్రించడం అంటే ఇదే కదా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/