రవితేజ దర్శకులు.. లక్కీ ఛాన్స్ ఎవరికో?

Update: 2023-01-20 05:30 GMT
మాస్ మహారాజ్ రవితేజ ధమాకా సినిమాతో సోలోగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. వెంటనే వాల్తేర్ వీరయ్య సినిమా ద్వారా మెగాస్టార్ తో కలిపి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. సరైన కథ పడితే రవితేజ ఎనర్జీ లెవల్స్ తో ఆడియన్స్ ని చాలా ఈజీగా ఎట్రాక్ట్ చేయవచ్చు అని ధమాకా, వాల్తేర్ వీరయ్య సినిమాలు ప్రూవ్ చేశాయి.

కంటెంట్ పరంగా కొత్తగా లేకపోయిన కథని నడిపించే విధంగా ఈ రెండు సినిమాల దర్శకులు సక్సెస్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. రవితేజ సుదీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న రావణాసుర మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. ఇక టైగర్ నాగేశ్వరరావు మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాల తర్వాత రవితేజ ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ నెక్స్ట్ బాబీతో మూవీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో అతనికి ఒక స్టొరీ లైన్ కూడా ఇప్పటికే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. మరో వైపు వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా రవితేజగా క్రాక్ సీక్వెల్ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబందించిన స్టొరీ లైన్ కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ ఇద్దరి దర్శకులతో రవితేజ ప్రాజెక్ట్స్ అయితే కచ్చితంగా ఉంటాయనేది టాలీవుడ్  సర్కిల్ లో వినిపిస్తుంది. అయితే వీరిలో ఎవరితో ముందుగా సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే వాల్తేర్ వీరయ్య సినిమాతో రవితేజ ఇప్పటికే నటించి హిట్ కొట్టాడు. ఈ నేపధ్యంలో గోపీచంద్ ని మొదటి ఛాన్స్ ఇస్తాడని కొంత మంది భావిస్తున్నారు. అయితే రవితేజ నుంచి ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులు కోరుకుంటున్నారు అనేది ధమాకా సినిమాతో ప్రూవ్ అయ్యింది. ఈ నేపధ్యంలో బాబీ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కథతో సినిమా చేస్తాడని కొంత మంది చెప్పుకొస్తున్నారు. మరి వీరిలో ఎవరికి ముందు ఛాన్స్ ఇస్తాదనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News