మాస్‌ రాజా కోసం ఇద్దరు ముద్దుగుమ్మలు ఖరారు

Update: 2020-10-17 00:30 GMT
రవితేజ 'క్రాక్‌' సినిమా తర్వాత చేయబోతున్న సినిమాకు రమేష్‌ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు. క్రాక్‌ మూవీ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ నెల చివరి వరకు లేదా అతి త్వరలోనే రవితేజ.. రమేష్ వర్మల కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ఈ మూవీని విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అవుతున్నాయి. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. అందుకే ఇద్దరు ముద్దుగుమ్మలను ఎంపిక చేశారట.

పెళ్లి చూపులు సినిమాతో ప్రశంసలు దక్కించుకున్న రీతూ వర్మ ను ఒక హీరోయిన్‌ గా ఎంపిక చేశారు. పెళ్లి చూపులు తర్వాత తమిళం మరియు ఇతర భాషల్లో మంచి ఆఫర్లు రావడంతో అటు వెళ్లిన రీతూ వర్మ టాలీవుడ్‌ లో మొదటి సారి పెద్ద హీరోతో నటించేందుకు సిద్దం అయ్యింది. రీతూ వర్మ మాత్రమే కాకుండా ఈ సినిమాలో రవితేజకు జోడీగా మరో హీరోయిన్‌ కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

గద్దలకొండ గణేష్‌ చిత్రంలో ఐటెం సాంగ్‌ చేసిన డింపుల్‌ హయతిని రవితేజ సినిమాలో మరో హీరోయిన్‌ గా నటింపజేస్తున్నారట. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్‌ తో ఒప్పందాలు కూడా పూర్తి అయినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే నెల జరుగబోతున్న షెడ్యూల్‌ లో వీరిద్దరు కూడా పాల్గొనబోతున్నట్లుగా మీడియా సర్కిల్స్‌ ద్వారా తెలుస్తోంది. రవితేజ ఇద్దరు మద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేయబోతున్న ఈ సినిమా కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా మాస్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకునే మాస్‌ ఎలిమెంట్స్‌ తో మాస్‌ మసాలా మూవీగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.
Tags:    

Similar News