కరోనా కారణంగా ఈ ఏడాదిలో చాలా మంది హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. మొదటి రెండు నెలల్లో తక్కువ సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి. సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా థియేటర్లు ప్రారంభం అయ్యే అవకాశం కనిపించడం లేదు. కనుక ఈ ఏడాదిలో చాల మంది హీరోల సినిమాలు లేకుండానే తదుపరి ఏడాదికి వెళ్లబోతున్నారు. రవితేజ వచ్చే ఏడాది కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
రవితేజ ఇప్పటికే రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. అందులో మొదటగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమా ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ లేదా నవంబర్ లో సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొద్ది తేడాతోనే రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాను ఈయన చేసే అవకాశాలున్నాయట. త్రినాధరావు నక్కిన మరియు రమేష్ వర్మల సినిమాలను సమాంతరంగా రవితేజ చేయబోతున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఒకటి ఆగస్టులో మరో సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి.
ఆ రెండు సినిమాలతో పాటు అన్ని కుదిరితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేసి వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో రవితేజ ఉన్నాడట. ఈ ఏడాదిలో వచ్చిన గ్యాప్ ను వచ్చే ఏడాది రవితేజ ఫిల్ చేస్తాడేమో చూడాలి. ఒక వేళ సురేందర్ రెడ్డి సినిమా లేకున్నా కూడా ఇప్పటికే విడుదలకు సిద్దం అయిన ‘క్రాక్’ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయడం వల్ల హ్యాట్రిక్ దక్కించుకునే అవకాశం ఉంది. సినిమాల విడుదల పరంగా హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న రవితేజ సక్సెస్ లతో హ్యాట్రిక్ సాధిస్తాడా అనేది చూడాలి.