మాస్ మహారాజ రవితేజ మళ్ళీ ధమాకా సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత మళ్ళీ ఎప్పటిలానే కొన్ని అపజయాలను చూసిన రవితేజ క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక మళ్ళీ ఆ సినిమా తర్వాత వరుసగా ఖిలాడి, రామారావు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.
ఇక ధమాకా సినిమా కూడా రొటీన్ కమర్షియల్ గా రాబోతోంది కాబట్టి ఈ సినిమా ఫలితం కూడా తేడా కొడుతుందేమో అని చాలా రకాల కామెంట్స్ అయితే వినిపించాయి. అంతేకాకుండా చాలావరకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. పర్ఫెక్ట్ మాస్ సినిమా తీస్తే రవితేజ సినిమాకు కాసుల వర్షం కురుస్తుంది అనే మరోసారి రుజువయింది.
అయితే రవితేజ ఈ సినిమా మీద మొదట అనుకున్నంత స్థాయిలో నమ్మకం పెట్టుకోలేదేమో అని అనిపిస్తోంది. ఇంతకుముందు రామారావు సినిమాకు రవితేజ పారితోషికం తీసుకోకుండా బిజినెస్ లో వాటా తీసుకోవాలని అనుకున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా తన సొంత బ్యానర్ RT టీమ్ వర్క్స్ కూడా జత చేశాడు. కానీ ఆ సినిమా బెడిసి కొట్టిందా. ఇక అంతకుముందు క్రాక్ తో ఫాలో అయినప్పుడు మాత్రం రెమ్యునరేషన్ కంటే డబుల్ ప్రాఫిట్ వచ్చింది.
కిలాడి సినిమాకు కూడా కొంత షేర్ మాట్లాడుకున్నట్లు టాక్ వచ్చింది. ప్రస్తుతం రవితేజ ఒక్కో సినిమాకు ఎనిమిది కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నాడు. అయితే ధమాకా సినిమాకు మాత్రం అతను షేర్ విషయంలో ఎలాంటి చర్చలు లేకుండా రెమ్యునరేషన్ తీసుకొని సినిమా షూటింగ్ పూర్తి చేశాడు.
ఇప్పుడు ఆ సినిమా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందిస్తోంది. రవితేజ ఇందులో కూడా షేర్ డీల్ సెట్ చేసుకొని ఉండి ఉంటే ఇప్పుడు పారితోషికం కంటే ఎక్కువగా మరో 5 కోట్లు అతని చేతికి వచ్చేవి. కానీ రవితేజ మాత్రం ధమాకా సినిమా విషయంలో రిస్క్ తీసుకోలేదు మరి తదుపరి సినిమాల విషయంలో అతను ఏ విధంగా అడుగులు వేస్తాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.