ఆ నటిని పక్కకు లాగి చెవి కొరికాడట
అవును.. ఆ హీరో ఆ నటిని పక్కకు లాగాడు. ఆపై చెవిలో గుసగుసగా ఏదో చెప్పాడు.. ఒక సలహా కూడా ఇచ్చాడు.
అవును.. ఆ హీరో ఆ నటిని పక్కకు లాగాడు. ఆపై చెవిలో గుసగుసగా ఏదో చెప్పాడు.. ఒక సలహా కూడా ఇచ్చాడు. అతడు ఆ సలహా ఇవ్వకముందే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. సదరు నటీమణి ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. అనవసరంగా ఇండస్ట్రీ గురించి నిజాలు మాట్లాడి బుక్కయిపోయింది.
చాలామంది ఆరంభ నటీనటులకు ముక్కుసూటిగా మాట్లాడితే ఇండస్ట్రీలో తలెత్తే సమస్యల గురించి తెలియదు. అయితే ఈ చిక్కుముడి గురించి సోమీ అలీ తెలుసుకునేప్పటికే ఇండస్ట్రీలో సత్సంబంధాలను కూడా కోల్పోయి చివరికి అవకాశాల్లేకుండా పోయాయి. అలా ఆ నటి ఇండస్ట్రీ నుంచి నిష్కృమించింది.
ఆత్మాభిమానం.. స్వీయగౌరవం అంటూ చాలా కబుర్లు చెప్పినా కానీ, తన ముక్కుసూటితనం.. పబ్లిగ్గా విమర్శించే నైజం కారణంగా సదరు నటి విలువైన కెరీర్ ని కోల్పోయిందని మీడియా కథనాలు వచ్చాయి. ఈ కథంతా ఎవరి గురించి అంటే? బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ గురించి.. సోమీ కొన్నేళ్ల తర్వాత ఇటీవల సడెన్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది. వచ్చీ రాగానే సల్మాన్ ఖాన్ వర్సెస్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్ గురించి వ్యాఖ్యానించింది. ఇటు సల్మాన్ కి అటు బిష్ణోయ్ వర్గానికి కూడా సోమీ ఎడా పెడా ఉచిత సలహాలు కూడా ఇచ్చేసింది. కానీ ఇరువర్గాల్లో ఎవరూ సోమీ వ్యాఖ్యలకు స్పందించలేదు.
నటి సోమీ అలీ ఇప్పుడు ఓ కఠోరమైన నిజం గురించి మీడియా ఎదుట మాట్లాడింది. తాను ఓసారి ఓ సినిమా ప్రీమియర్ కి వెళ్లింది. అక్కడ సినిమా చూశాక ఇది చెత్త సినిమా. ఇలాంటి సినిమాకి ఎందుకొచ్చాను! అంటూ పబ్లిగ్గానే వాపోయింది. అయితే పక్కనే ఉన్న దర్శకుడు అది విని చాలా ఫీలయ్యాడట. అయితే సోమీ అలా వ్యాఖ్యానించగానే, తన చెంతే ఉన్న హీరో సునీల్ శెట్టి తనను పక్కకు లాగాడు. అలా మాట్లాడకూడదని చెవిలో సలహా ఇచ్చాడు. ఈ విషయాన్ని సోమీ ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంది. దర్శకుడి చేతకానితనాన్ని నిలదీసిన తనకు ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని కూడా సోమీ అంది. అయితే ఏం జరిగినా కానీ తన స్వభావం మారదని కూడా వ్యాఖ్యానించింది. సోమీ అలీఖాన్ కెరీర్ తొలినాళ్లలో దూకుడుగా వ్యవహరించి చేతులు కాల్చుకుంది.