విలువలతో ఇండస్ట్రీలో సినిమాలు చేయలేం!
తాజాగా మరో బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ ఇండస్ట్రీలో తనకెదురైన చేదు అనుభవాల గురించి రివీల్ చేసింది.
బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం నిరంతరం చర్చకొస్తూనే ఉంటుంది. ఏదో ఒక నటి ఈ అంశంపై మాట్లాడు తుంటారు. లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నా? సినిమా రంగం ఎక్కువగా హైలైట్ అవుతుంద ని..అయితే మిగతా రంగాలతో పొలిస్తే అధికంగా సినిమా రంగంలో ఉంటుందని పలువురు బాలీవుడ్ నటీమణులు అభిప్రాయ పడిన సందర్భాలున్నాయి. తాజాగా మరో బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ ఇండస్ట్రీలో తనకెదురైన చేదు అనుభవాల గురించి రివీల్ చేసింది.
`29 ఏళ్ల క్రితం ఎదుర్కొన్న ఓ చేదు సంఘటన గుర్తు చేసుకుంది. ఇండస్ట్రీలో నువ్వేం చేయగలవు అన్నది ఎవరూ చూడరు. హీరోయిన్స్ ఏం చేయాలనేది ? హీరోలు మాత్రమే డిసైడ్ చేస్తారు. విలువలతో సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే కుదరదు. కాస్టింగ్ కౌచ్ భయంతో ఇండస్ట్రీకి వచ్చి వెనక్కి పోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురొడ్డిన వాళ్లు ఇంకొంత మంది.
18 ఏళ్ల వయసులోనే నా దగ్గరకు ఓ నటుడు వచ్చి నాతో స్నేహం చేస్తానన్నాడు. అలా ఉంటేనే అవకాశాలు వస్తాయని చెప్పాడు. ఇంకెంతో మంది నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. ఓ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నాడు. డ్రైవర్, కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా ఒంటరిగా రమ్మన్నాడు. కొన్ని రకాల పరిస్థితులు ఆ ఉచ్చులో చిక్కుకునేలా చేస్తాయి` అని అంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇషా కొప్పికర్ తెలుగు ఆడియన్స్ కు సుపరిచితమే. 1997లో `వరప్రసాద్` సినిమాతో తెలుగులో లాంచ్ అయింది. అందులో స్పెషల్ సాంగ్ చేసింది. నటిగా నాగార్జున నటించిన `చంద్రలేఖ` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `ప్రేమతో రా` సినిమాలో నటించింది. నిఖిల్ హీరోగా నటించిన `కేశవ`లోనూ నటించింది. ఇదే అమ్మడి చివరి తెలుగు సినిమా. తమిళ్ లోనూ చాలా సినిమాలు చేసింది.