నేల టిక్కెట్ తరువాత అలా పడిపోయింది

Update: 2018-06-08 04:19 GMT
మాస్ మహరాజా సినిమాలంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీ అన్నట్టుగా ఉండేవి. సినిమాలో మిగతా అంశాలేవీ సరిగా ఉన్నా లేకపోయినా ఎంటర్ టెయిన్ మెంట్ కు లోటుండేది కాదు. అందుకే చిన్నాపెద్దా అతడి సినిమాలంటే ఇష్టపడేవారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నార్త్ లో ప్రేక్షకులు కూడా రవితేజ సినిమాలపై తెగ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.

రవితేజ నటించిన ప్రతి సినిమా డబ్బింగ్ అయి హిందీ టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ అయింది. యూట్యూబ్ లోనూ అతడి సినిమాలు ఇష్టంగా చూసేవాళ్లు చాలామందే ఉండేవారు. అందుకే రవితేజ సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కు డబ్బులు బాగానే గిట్టుబాటు అవుతుంటాయి. ఈ మధ్య మాస్ మహారాజా సినిమాలన్నీ వరసగా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడుతున్నాయి. తాజాగా వచ్చిన నేలటిక్కెట్టు అయితే డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కు దాదాపు రూ. 10 కోట్ల దాకా వచ్చాయని తెలిసింది. సినిమా శాటిలైట్ రైట్లకన్నా ఈ మొత్తమే ఎక్కువ. కానీ వరస ఫ్లాపులు రవితేజకున్న ఇమేజ్ ను దెబ్బతీశాయి.

రవితేజత తరవాత తమిళ మూవీ తెరి రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ రూ. 6 కోట్లు మాత్రమే పలికాయి. ముందు సినిమాకు పలికిన అమౌంట్ తో పోలిస్తే ఇది సగమే కావడం విశేషం. నేల టిక్కెట్ తరువాత మార్కెట్ ఎలా పడిపోయింది ఇది చూస్తే మనకు అర్ధం అవుతోంది. సక్సెస్ కొత్త కొత్త ఛాన్సులను వెతికి తీసుకొస్తుంది. అదే ఫ్లాప్.. ఉన్న దారులను మూసేస్తుంది. మిగతా చోట్లకన్నా ఇండస్ట్రీలో ఈ రూల్ బాగా అప్లయ్ అవుతుంది.  మాస్ మహారాజా  ఈ విషయంలో కాస్త సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన టైమొచ్చింది.



Tags:    

Similar News