మారిన ట్రెండ్ లో హీరోలంతా రియలైజ్ అవుతున్నారు. ఫ్లాప్ లకు రీజన్ ఏంటో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత తప్పిదాల్ని రిపీట్ కాకుండా చాలానే జాగ్రత్త పడుతున్నారు. కథల ఎంపిక నుంచి లుక్ వైజ్ తీసుకోవాల్సిన జాగ్రత్త - ప్రొడక్షన్ హౌస్ .. దర్శకరచయితల ట్యాలెంట్.. ఇలా ప్రతిదీ ఆచితూచి ఆలోచిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సైతం అందుకు అతీతుడేం కాదు. టచ్ చేసి చూడు - నేల టిక్కెట్టు లాంటి డిజాస్టర్లను చూశాడు కాబట్టి, ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. పైగా తన లుక్ పరంగా వచ్చిన విమర్శల్ని తిప్పి కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
అయితే ఒకే ఒక్క ఆఫర్.. అదీ తన స్నేహితుడి కోసం దిగొచ్చి ఫ్లాపుల్లో ఉన్నా ఆపన్నహస్తం ఇచ్చాడు. అలా శ్రీనువైట్ల దర్శకత్వంలో `అమర్ అక్బర్ ఆంటోని` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అసలే వైట్ల ఫ్లాపుల్లో ఉండడంతో ఈ సినిమా బిజినెస్ పరంగా చిక్కుల్లో ఉందని ప్రచారం సాగుతోంది. అయితే మాస్ మహారాజా ఈ ప్రాజెక్టును తనదైన మార్క్ తో బయటపడేస్తాడనే అభిమానులు భావిస్తున్నారు. రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్ కంటెంట్ కి కనెక్టయితే హిట్టు కొట్టడం కష్టమేమీ కాదు. అందుకు తగ్గట్టే రవితేజ - వైట్ల మారిన మనుషుల్లా సినిమా తీస్తున్నారట. వైట్ల మునుపటిలా ఫార్ములాటిక్ స్క్రీన్ ప్లేతో కాకుండా కొత్తదనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట.
ఈ సినిమా తర్వాత వి.ఐ.ఆనంద్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదో ప్రయోగాత్మక కమర్షియల్ సినిమా అని తెలుస్తోంది. స్క్రీన్ ప్లే పరంగా కొత్తదనం కోసం కసరత్తు చేస్తున్నారట. ఈ చిత్రంలో రవితేజ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తారని ఓ లీక్ అందింది. మొత్తానికి జనం మారుతున్నారు. రవితేజ ఇంకా మారాడని అర్థమవుతోంది. మాస్ రాజా ఇప్పటికైనా అన్నిరకాలా విశ్లేషించుకున్నాడని భావించవచ్చు. వయసుకు తగ్గ పాత్రలు చేయకే వైఫల్యాలు ఎదురయ్యాయని భావించి ఉండొచ్చు. మొత్తానికి ఈ మార్పు గెలుపునకు సంకేతం కావాలని అభిమానులు భావిస్తున్నారు.