రాజా అక్కడ బాగా తగ్గాడు

Update: 2017-10-23 06:15 GMT
ప్రస్తుత రోజుల్లో చాలా వరకు మన సినిమా వాళ్లు డాలర్ల పై మనసు బాగా పారేసుకున్నారనే చెప్పాలి. ఇండియాలో రిలీజ్ చేసినట్టుగానే బయట దేశాల్లో కూడా వీలైనన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యూఎస్ లో తెలుగు చిత్రాలకు డిమాండ్ చాలా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్ళలో అక్కడ టాలీవుడ్ చిత్రాల మార్కెట్ చాలా పెరిగింది.

తెలుగు హీరోలు కూడా స్పెషల్ ప్రీమియర్ షోలు వేసి మరి కలెక్షన్స్ ని అందుకుంటున్నారు. అయితే రీసెంట్ గా విడుదలైన రవి తేజ - రాజా ది గ్రేట్ సినిమా మాత్రం అక్కడ అంతగా కలెక్షన్స్ ని రాబట్ట లేకపోయింది. అనిల్ రావి పూడి దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. మొన్నటి వరకు దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ అమెరికాలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. కానీ రాజా ది గ్రేట్ మాత్రం ఆ స్థాయిలో హిట్ అవ్వలేదు అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో పర్లేదేమో కాని.. అమెరికాలో మాత్రం నష్టాలు తప్పేలా లేవు.

విడుదల రోజు మంగళవారం $133751 రాజా ది గ్రేట్ రాబట్టగా బుధ గురువారాల్లో కాస్త కలెక్షన్స్ తగ్గిపోయాయి. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ కి $326k వసూళ్లను రాబట్టింది. ఆ లెక్కన చూస్తే సినిమాను కొన్న పంపిణీదారులకు 50% లాస్ తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో ప్రక్కన విజయ్ మెర్సల్ సినిమా మాత్రం మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
Tags:    

Similar News