టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే మాస్ రాజా రవితజ తనయుడు మహాధన్ ఆల్రెడీ కెమెరా ముందుు వచ్చేశాడు. ‘రాజా ది గ్రేట్’లో చిన్నప్పటి రవితేజగా కనిపించాడీ కుర్రాడు. అందులో మహాధన్ కనిపించింది కాసేపే అయినా తనదైన ముద్ర వేశాడు. అతడి జోరు చూస్తే తర్వాత తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాడనిపించింది. నిజానికి మాస్ రాజా కొత్త సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో కూడా ఒక కుర్రాడి పాత్ర ఉందట. దాన్ని మహాధన్ తోనే చేయిద్దామని దర్శకుడు శ్రీను వైట్ల అనుకున్నాడట. రవితేజ కూడా అందుకు ఓకే చెప్పాడట. కానీ ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నాడట. అందుకు కారణం ఈ చిత్ర షెడ్యూళ్లు లేటవ్వడమేనట.
ముందు అనుకున్న ప్రకారం అయితే వేసవి సెలవుల్లో మహాధన్ కు సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేయాలనుకున్నారట. కానీ షెడ్యూల్ ఆలస్యమయ్యేసరికి మహాధన్ స్కూల్ మొదలయ్యాకే అతను నటించాల్సి వస్తోందట. స్కూల్ మాన్పించి.. చదువకు ఆటంకం కలిగించి సినమాల్లో నటింపజేయాల్సిన అవసరం లేదని రవితేజే ఈ సినిమాకు మహాధన్ వద్దని చెప్పేశాడట. తన కొడుక్కి సినిమా పిచ్చి బాగానే ఉందని.. ఐతే చదువు తర్వాత అతడి అభిరుచిని బట్టి కెరీర్ ఎంచుకుంటాడని మాస్ రాజా చెప్పాడు. ఐతే ఇలా ఎన్ని మాటలు చెప్పినా.. హీరోల కొడుకులు ఆటోమేటిగ్గా హీరోలే అవుతారు. అందులోనూ గత కొన్నేళ్లలో వారసుల జోరు బాగా పెరిగింది. హీరోల కొడుకులే కాదు.. వాళ్ల అల్లుళ్లు.. దూరపు బంధువులు సైతం హీరోలైపోతున్నపుడు వీళ్లు ఎలా ఆగుతారు?