రవితేజ హీరోగా 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రవితేజ సబ్ కలెక్టర్ గా కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా దివ్యాన్ష - రజీషా విజయన్ అలరించనున్నారు.
సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నాని చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదు .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించారు.
ఈ స్టేజ్ పై రవితేజ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవలసింది మా ఆర్ట్ డైరెక్టర్ గురించి .. మా ఎడిటర్ గురించి .. మా సినిమాటోగ్రఫర్ గురించి. మా అదృష్టం బాగుండి ఈ సినిమాకి ఒక మంచి టీమ్ సెట్ అయింది.
సామ్ సీఎస్ ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. మా డైరెక్టర్ గారు చెప్పినట్టు తుప్పు వదిలిపోతుందనే అనుకుంటున్నాను. ఫైట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. శరత్ ఈ సినిమాను చాలా బాగా తీశాడు. ఇన్ని ఇంటర్వ్యూలు ఏ డైరెక్టర్ ఇచ్చి ఉండడు.
ఈ సినిమాలో నేను ఇంతవరకూ చేయని ఒక పాత్రను చేస్తున్నాను. తప్పకుండా ఈ పాత్ర మీకు నచ్చుతుంది. సుధాకర్ చెరుకూరి వంటి నిర్మాతతో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను రెడీగానే ఉంటాను. మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ చాలా బాగా చేశారు.
సినిమాలో అన్వేషి చేసిన సాంగ్ చాలా బాగా వచ్చింది. నాని అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్ గా .. ప్రొఫెషనల్ గా. సౌత్ ఇండియాలోనే గొప్పనటుడు .. వెరీ సెన్సిబుల్ యాక్టర్ ఆయన. అప్పట్లోనే వేణుతో కలిసి 'స్వయంవరం' చేయవలసింది .. మిస్సైయ్యాను. మళ్లీ ఇంతకాలానికి కుదిరింది .. ఇక గ్యాప్ ఇవ్వొద్దు వేణు .. ఇరగదేసేద్దాం" అంటూ చెప్పుకొచ్చాడు.