మీరే నా ఎనర్జీ.. వస్తున్నాం కొడుతున్నాం అంతే..!

Update: 2023-04-02 11:19 GMT
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా శిల్పకళా వేదికలో రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మాస్ రాజా ఫ్యాన్స్ అంతా కూడా భారీ సంఖ్యలో ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. రవణాసుర మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న రవితేజ ఈవెంట్ లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడి ఫ్యాన్స్ ని అలరించారు. ముఖ్యంగా డైరెక్టర్ సుధీర్ వర్మ సత్తా ఏంటో ఈ సినిమాతో తెలుస్తుందని.. తనకు ఇష్టమైన వారిలో తను ఒకడని అన్నారు రవితేజ. ఈ సినిమా తర్వాత సుధీర్ వర్మ నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడని అనారు.

ఇక నిర్మాత అభిషేక్ నామా మల్టీ టాలెంటెడ్ అని.. రావణాసుర టైటిల్ సజెస్ట్ చేసింది అతనే.. టైటిల్ డిజైన్ కూడా ఆయనే చేశారు. ఈమధ్య చాలా సినిమాలకు టైటిల్ పోస్టర్ ఆయనే చేశారు. నిర్మాతలుగా మా కాంబినేషన్ మునుముందు కూడా ఇలానే కొనసాగాలని కోరుతున్నా అన్నారు. హైపర్ ఆదితో తనకు మంచి టైమింగ్ కుదిరిందని ఇద్దరం ఈ కాంబో కొనసాగిస్తామని అన్నారు రవితేజ. ఇక ఈ సినిమాకు ఒక పాట ఇచ్చిన భీంస్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. సినిమాకు పనిచేసిన మరో మ్యూజిక్ డైరెక్టర్ హర్ష కూడా మంచి సౌండ్ ఇచ్చాడని అన్నారు.

తమ్ముళ్లూ మీరే నా ఎనర్జీ.. మీరే నా ఉత్సాహం అంటూ స్పీచ్ మొదలు పెట్టిన రవితేజ. రావణాసుర మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని సినిమాతో సూపర్ హిట్ కొడుతున్నాం అని చెప్పారు. రవితేజ ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అందుకే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా చెబుతూ వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ ని ఈ సినిమాలో కొత్తగా చూస్తారని. ఈ సినిమా తర్వాత సుశాంత్ కూడా మరో రేంజ్ కి వెళ్తాడని అన్నారు.

ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ వాల్తేరు వీరయ్య సినిమా హిట్ తో కూడా సూపర్ జోష్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు రావణాసురతో హ్యాట్రిక్ మీద కన్నేశాడు. సినిమా మీద రవితేజ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. అనుకున్నట్టుగా మాస్ మహరాజ్ ఫ్యాన్స్ ని ఈ సినిమా అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.


Similar News