కొరియాలో రామ్ చరణ్ క్రేజ్ చూశారా?

ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తోన్న అతడు.. వరుస చిత్రాలతో సందడి చేస్తున్నాడు.

Update: 2024-10-21 06:18 GMT

టాలీవుడ్‌లోని హీరోలు అందరూ తమ రేంజ్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా కొందరు స్టార్లు పాన్ ఇండియా, గ్లోబల్ రేంజ్‌కు ఎదిగేందుకు ట్రై చేస్తున్నారు. అలా ఇప్పటికే కొందరు అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నారు. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తోన్న అతడు.. వరుస చిత్రాలతో సందడి చేస్తున్నాడు.

రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు ఎస్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' (Game Changer) అనే సినిమాను చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. అంతేకాదు, దీనికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది.

శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. అదే సమయంలో దీనికి సంబంధించిన ప్రమోషన్‌ను కూడా షురూ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే దీని నుంచి రెండు పాటలను కూడా విడుదల చేశారు. ఈ రెండు సాంగ్స్ కూడా భారీ రెస్పాన్స్‌ను అందుకుని.. ఈ సినిమా రేంజ్‌ను కూడా అదిరిపోయేలా పెంచేశాయి.

‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి ఇటీవలే విడుదల అయిన 'రా మచ్చా రా' సాంగ్‌కు కూడా అన్ని వర్గాల వాళ్ల నుంచి దిమ్మతిరిగే స్పందన వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ పాట ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. దీనిపై నెటిజన్లు కోట్ల సంఖ్యలో రీల్స్ కూడా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ పార్క్ మిన్ జున్ తన టీమ్‌తో కలిసి ‘రా మచ్చా రా’ సాంగ్‌కు డ్యాన్స్‌ చేశారు.

పాప్ సింగర్ పార్క్ మిన్ జున్ టీమ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అన్న విషయం తెలిసిందే. అలాంటి వాళ్లే రామ్ చరణ్ పాటకు డ్యాన్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను మెగా అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే కోట్లలో వ్యూస్‌ను తెచ్చుకుని వైరల్ అయిపోయింది. దీంతో రామ్ చరణ్ పేరు మరోసారి వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న 'గేమ్ చేంజర్' సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News