'కేరింత' కుర్రాడు ఓ ఇంటివాడయ్యాడు!
కొన్ని పెళ్లి ఫోటోలను షేర్ చేసి అభిమానులకు విషయం చెప్పాడు.
'కేరంత' చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విశ్వంత్ ఓ ఇంటివాడు అయ్యాడు. జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. భావన అనే అమ్మాయితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ఈ వార్తను తానే స్వయంగా తెలిపాడు. కొన్ని పెళ్లి ఫోటోలను షేర్ చేసి అభిమానులకు విషయం చెప్పాడు. ఈ ఫోటోలను ఉద్దేశించి ' ఏ ప్రామిస్ ఆఫ్ లైఫ్ టైమ్' అనే క్యాప్షన్ ఇచ్చాడు. విశ్వంత్-భావనల ఎంగేజ్ మెంట్ ఆగస్టులో జరిగింది.
వివాహానికి రెండు నెలలు సమయం తీసుకుని తాజాగా మూడు ముడులు...ఏడు అడుగులు వేసి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ప్రస్తుతం విశ్వంత్ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటి జనులు విషెస్ తెలియజేస్తున్నారు. విశ్వంత్ స్వస్తలం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాకు చెందిన సామర్లకోట. కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
ఆ తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఉండగానే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో 'కేరింత' లో అవకాశం రావడంతో చదువు మధ్యలోనే వదిలేసి సినిమాల్లోకి వచ్చాడు. తొలి సినిమా మంచి విజయం సాధించ డంతో అటుపై మంచి అవకాశాలు అందుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. 'మనమంతా', 'జెర్సీ', 'ఓ పిట్ట కథ', 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్', 'కథ వెనక కథ',' తోలు బొమ్మలాట', 'ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా', 'బాయ్ ఫ్రెండ్ ఫర్ మైర్', 'మ్యాచ్ ఫిక్సింగ్', 'హైడ్ అండ్ సీక్' తదితర చిత్రాల్లో నటించాడు.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న' గేమ్ ఛేంజర్' లోనూ నటి స్తున్నాడు. ఇంకా చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్ లు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వివాహం నిరాడంబరంగా జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా చేసుకున్నాడు. వ్యక్తిగతంగా సింపుల్ గా ఉండటం విశ్వంత్ కి ఇష్టం అన్నట్లు తెలుస్తోంది.