ఓపెనింగ్ బంతికే సిక్సర్ కొడితే ఎలా ఉంటుంది! గ్యాలరీ ఆడియెన్ మైండ్ లోనే కాదు.. అది ప్రత్యర్థి గుండెల్లో కూడా ప్రతిధ్వనిస్తుంది. ఈరోజు నాకు ఏదో అయ్యింది! అని బౌలర్ కూడా భయపడతాడు. చూస్తుంటే టైగర్ నాగేశ్వరరావు వ్యూహం అలానే ఉంది. ఓపెనింగ్ డే బిగ్ హంగామాతో జాతీయ మీడియా దృష్టినే ఆకర్షించారు టైగర్ నాగేశ్వరరావు మేకర్స్.
TNR (టైగర్ నాగేశ్వరరావు) పూజా కార్యక్రమాల కోసం అభిషేక్ అగర్వాల్ ఏకంగా అరకోటి వెచ్చించారని తెలిసింది. రవితేజ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.
అభిషేక్ అగర్వాల్ ఇంతకుముందు నిర్మాణ భాగస్వాములతో కలిసి సినిమాలు నిర్మించారు. అయితే ఈ సారి మాత్రం అతనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఇది తనకు మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి డే - వన్ నుండి హైప్ ని క్రియేట్ చేస్తున్నారని అర్థమవుతోంది.
హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన హోటల్ నోవాటెల్ -HICCలో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం నిర్మాత దాదాపు యాభై లక్షలు ఖర్చు చేసారు. విస్తృత కవరేజీ కోసం ఇతర రాష్ట్రాల నుండి మీడియాను కూడా ఆహ్వానించారని తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో హిట్టు కొట్టాలన్న పంతంతోనే ఇలా ఘనంగా ప్లాన్ చేశారని అర్థమవుతోంది.
కారణం ఏదైనా కానీ దేశవ్యాప్తంగా పరిశ్రమలు మీడియా దృష్టిని ఆకర్షించడంలో అభిషేక్ నిజంగా విజయం సాధించాడు. ఇటీవలే జాతీయ స్థాయి ప్రాజెక్ట్ `ది కాశ్మీర్ ఫైల్స్` తెలుగు వెర్షన్ ని ఆయన రిలీజ్ చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత నిన్నటి ఈవెంట్ కు విపరీతంగా ఖర్చు పెట్టాడు. భారీ సెట్ లో ఈవెంట్ ని విజువల్ రిచ్ గా నిర్వహించారు. అభిషేక్ అగర్వాల్ అతిథులు.. మీడియా సహా ఇతర ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
టైగర్ నాగేశ్వరరావుపై భారీ బెట్టింగ్
స్టూవర్డ్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథతో సినిమాని తెరకెక్కించేందుకు గత కొంతకాలంగా సన్నాహకాలు సాగుతున్నా ప్రారంభోత్సవం చాలా ఆలస్యమైంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ స్క్రిప్టుపై తమకే అధికారం ఉంది అంటూ ఇరువర్గాల మధ్య ఘర్షణ తెలిసినదే. అయితే ఎట్టకేలకు టైగర్ నాగేశ్వరరావు సినిమా ఘనంగా ప్రారంభమైంది. తేజ్ నారాయణ అగర్వాల్ సమర్పణలో ఏఏ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
రవితేజ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకరచయిత. మాస్ రాజా పూర్తి యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇంతకుముందు ప్రారంభోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి- నిర్మాత విష్ణు ఇందూరి.. పీటర్ హెయిన్స్ .. రామ్ లక్ష్మణ్ మాస్టార్లు.. జీవీ ప్రకాష్ కుమార్.. సహా పలువురు అతిథులు పాల్గొన్నారు.
కథానాయికలు సహా చిత్రబృందం పూజాకార్యక్రమాల్లో పాల్గొంది. పూజా కార్యక్రమా భారీ సెట్లలో విజువల్ రిచ్ గా ఎంతో వైభవంగా సాగాయి. రూత్ లెస్ రాజా దుమారమే అంటూ ప్రచారం సాగింది. ప్రభాస్ -చరణ్ - బన్ని పాన్ ఇండియా రేస్ లో ఉన్నారు. వీళ్లకు ధీటుగానే రవితేజ కూడా పాన్ ఇండియా రేస్ లోకి దూసుకొస్తున్నాడని సిగ్నల్ అందినట్టే.