సైలెంట్ గా శ్రీశైలంలో మెరిసిన మీనాక్షి

ఇదిలా ఉంటే మీనాక్షి చౌద‌రి, శ్రీశైల భ్ర‌మ‌రాంబ మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకుంది. మ‌ల్లికార్జునుడికి రుద్రాభిషేకం, భ్ర‌మ‌రాంబ దేవికి కుంకుమార్చ‌నతో పాటూ మ‌రిన్ని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది.

Update: 2025-02-01 12:01 GMT

ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన మీనాక్షి చౌద‌రి ప్ర‌స్తుతం టాలీవుడ్ లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ గా వ‌రుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తుంది. గ‌తేడాది దుల్క‌ర్ స‌ల్మాన్ తో క‌లిసి ల‌క్కీ భాస్క‌ర్ తో సూపర్ హిట్ అందుకున్న మీనాక్షి, ఈ ఏడాది విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌లిసి చేసిన సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను త‌న అకౌంట్ లో వేసుకుంది.

 

ఇదిలా ఉంటే మీనాక్షి చౌద‌రి, శ్రీశైల భ్ర‌మ‌రాంబ మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకుంది. మ‌ల్లికార్జునుడికి రుద్రాభిషేకం, భ్ర‌మ‌రాంబ దేవికి కుంకుమార్చ‌నతో పాటూ మ‌రిన్ని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది. ఎవ‌రికీ తెలియ‌కుండా రావ‌డంతో మీనాక్షి వెళ్లిన చోట ఎలాంటి హ‌డావుడి జ‌ర‌గ‌లేదు. మీనాక్షిని గుర్తించిన పలువురు ఆమెతో సెల్ఫీలు దిగారు.

ద‌ర్శ‌న అనంత‌రం మీనాక్షి పాతాళ గంగ వ‌ద్ద బోట్ లో షికారు చేసింది. దానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. మామూలుగా సెల‌బ్రిటీలెవ‌రైనా స‌రే ఎక్క‌డికి వెళ్లినా త‌మ చుట్టూ బాడీ గార్డులు లేదా కుటుంబ స‌భ్యులు తోడుగా ఉంటారు. ప‌బ్లిక్ ఏరియాల్లోకి వెళ్లేట‌ప్పుడు ఎవ‌రైనా నానా హ‌డావుడి చేస్తుంటారు కానీ మీనాక్షి మాత్రం ఎలాంటి హ‌డావుడి లేకుండా వ‌చ్చి స్వామి వారిని ద‌ర్శించ‌నుకుని వెళ్లింది.

సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌డంతో మీనాక్షికి ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌ల నుంచి అవ‌కాశాలు క్యూ క‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో అమ్మ‌డు త‌న పారితోషికాన్ని కూడా పెంచింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజ‌మెంత అన్న‌ది తెలియాల్సి ఉండ‌గా, మీనాక్షి ప్ర‌స్తుతం న‌వీన్ పోలిశెట్టితో క‌లిసి అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాలో న‌టిస్తోంది.

Tags:    

Similar News