నాగేశ్వరరావు స్పీడ్... వాటికంటే ముందే వచ్చేనా ఏంటీ?

Update: 2022-04-16 02:30 GMT
రవితేజ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. ఇటీవలే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు ధమాకా మరియు రాక్షసుడు అనే సినిమాలు కూడా షూటింగ్ ముగింపు దశకు వచ్చాయి.

ఇన్ని సినిమాల నడుమ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా రవితేజ మొదలు పెట్టాడు. కొన్ని రోజుల క్రితం చిరంజీవి ముఖ్య అతిథిగా టైగర్ నాగేశ్వరరావు సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెల్సిందే. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

షూటింగ్‌ మొదలు పెట్టిన వెంటనే నైట్‌ షెడ్యూల్‌ ను చేస్తున్నారు. సినిమాలో రవితేజ దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. కనుక సినిమా లో ఎక్కువ శాతం నైట్‌ షెడ్యూల్‌ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. నైట్ షెడ్యూల్‌ చాలా స్పీడ్ గా పూర్తి అవుతాయి. డే తో పోల్చితే నైట్‌ షెడ్యూల్స్ విషయంలో చాలా స్పీడ్ కనిపిస్తూ ఉంటుంది.

కనుక టైగర్‌ నాగేశ్వరరావు చాలా స్పీడ్‌ గా పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉండగా మరో వైపు రెండు సినిమాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సమయంలోనే టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ జోరు చూస్తుంటే ఇదే ఏడాదిలో సినిమా వచ్చేలా ఉంది అనిపిస్తుంది.

టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల విషయమై ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కాని మొదటి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా తో రవితేజ మొదటి పాన్ ఇండియా సక్సెస్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.

ప్రస్తుతం చేస్తున్న నైట్‌ షెడ్యూల్ ను మరో రెండు వారాలు కొనసాగించే అవకాశం ఉంది. ఆవెంటనే కీలక యాక్షన్ షెడ్యూల్‌ ను నిర్వహించబోతున్నట్లుగా దర్శకుడు వంశీ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News