సర్వేశ్వరరావు.. సంపేశావయ్యా!!

Update: 2015-11-19 22:30 GMT
టాలీవుడ్ లో బోలెడు సినిమాలు - బ్లాక్ బస్టర్లు వస్తుంటాయి. ఇండియాలో రెండో పెద్ద ఫిలిం ఇండస్ట్రీ మనదే. కానీ మన మూవీ మేకర్స్ కి పొరుగు భాషల నుంచి తెచ్చుకోవడమంటే మహా మోజు. ఇది వరకు హీరోయిన్స్ వరకే పరిమితమైన ఈ అలవాటు ఇప్పుడు అన్ని విభాగాల్లోకి వచ్చేసింది. పక్క భాషల వాళ్లకి పెద్ద మొత్తంలో చెల్లించి మరీ విలన్లని - కేరక్టర్ ఆర్టిస్టులను తెచ్చుకుంటూ ఉంటారు.

ఇక్కడి వాళ్లకి ముఖ్యంగా తెలుగువాళ్లకి మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించే అలవాటు చాలా తక్కువ. నవంబర్ 27న రిలీజ్ అవుతున్న తను నేను మూవీలో డైరెక్టర్ రవిబాబు హీరోయిన్ తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. బడిరెడ్డి సర్వేశ్వరరావు పాత్రలో జీవించేశాడు రవిబాబు. ట్రైలర్ లో చూసిన గెటప్ - 4 ముక్కల తోటే ఈ రోల్ ని ఎలా పండించేశాడనే  విషయం అర్ధమవుతుంది. కూతురుని అమెరికా పంపించాలి, భార్య మనసులో ఆలోచనలు పసిగట్టాలి, కూతురు ప్రేమించినోడిని తిరస్కరించాలి.. ఇన్ని వేరియేషన్స్ ని ఈజీగా చూపించేశాడు రవిబాబు. స్వతహాగా డైరెక్టర్ కూడా కావడంతో కేరక్టర్ లో లీనమైపోయాడు. సంపేశాడంతే.

ఇంత ట్యాలెంట్ ఉన్న రవిబాబును మన డైరెక్టర్లు ఇప్పటివరకూ కేవలం సిల్లీ కామెడీకి మాత్రమే వాడుకున్నారు. విలన్, కేరక్టర్ ఆర్టిస్టుగా తన సినిమాల్లో పాత్రలతో రవిబాబు ప్రూవ్ చేసుకున్నా.. బయటి సినిమాల్లో మంచి రోల్స్ తగల్లేదు. ఇప్పుడు తొలిసారిగా తను నేనులో వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా వాడేసుకున్నాడు. ఇకనైనా రవిబాబులో ఉన్న జీనియస్ కేరక్టర్ ఆర్టిస్టు మన మూవీ మేకర్స్ గుర్తించాల్సిన అవసరం ఉంది. 
Tags:    

Similar News