కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య తెలుగు సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. మంచి నటుడిగా పేరున్న.. తాను నటించిన ప్రతి సినిమాతోనూ నవ్వించిన విజయ్ ఇలా తన జీవితాన్ని ముగించడం అందరినీ కలచివేసింది. విజయ్ కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు రవిబాబు.. ఈ విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. విజయ్ తనతో ఎప్పుడూ టచ్ లో ఉన్నాడని.. అతడితో తనకు గొప్ప అనుబంధం ఉందని.. తమ మధ్య లెక్కలేనన్ని మంచి మెమొరీస్ ఉన్నాయని.. అతడి మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాని.. ఈ బాధ నుంచి తాను ఎన్నాళ్లకు బయటికి వస్తానో తెలియదని రవిబాబు అన్నాడు. విజయ్ సాయితో తన అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.
‘అమ్మాయిలు అబ్బాయిలు’ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ముందు విజయ్ చేసిన పాత్ర కోసం చాలామందిని ఆడిషన్స్ చేశామని.. ఆ పాత్ర కోసం నిర్మాత జెమిని కిరణ్ గారి ఆఫీసులో ఒక గీత గీసి దాని కంటే ఎత్తు ఉన్న వాళ్లు ఈ పాత్రకు పనికి రారని చెప్పామని.. ఐతే విజయ్ ఒక రోజు ఆడిషన్ కు వచ్చి ఆ గీత దగ్గర నిలుచుంటే.. దాని కంటే ఒక అంగుళం ఎక్కువున్నాడని.. దీంతో అతణ్ని వెళ్లిపోమని చెప్పానని.. అతను నిరాశగా వెళ్లిపోయాడని రవిబాబు తెలిపాడు. ఐతే తర్వాతి రోజు విజయ్ మళ్లీ ఆ ఆఫీసులో కనిపించాడని.. ఏంటని అడిగితే తాను నిన్న షూలతో వచ్చానని.. ఇప్పుడు అవి లేకుండా నిలబడతానని అన్నాడని.. సరే అని నిలబడితే ఆ గీత కంటే కొంచెం తక్కువ ఎత్తే ఉండటంతో విజయ్ ని ఆ పాత్రకు ఓకే చేశానని రవిబాబు తెలిపాడు. అతడికి నటన నేర్పించి.. ఎన్నో విషయాలు తెలియజెప్పి తన కెరీర్ ఎదుగుదలలో తాను కీలక పాత్ర పోషించానని.. అతను చాలా మంచి ఆర్టిస్టని రవిబాబు తెలిపాడు.
‘అమ్మాయిలు అబ్బాయిలు’ విడుదలకు ముందు విజయ్ తండ్రి అతణ్ని తీసుకుని.. తన దగ్గరికి వచ్చాడని.. తనకు కొత్తగా ఇంకో పేరు పెట్టి ఆశీర్వదించాలని చెప్పాడని.. అప్పుడే తాను ఏదైనా దేవుడి పేరు జోడిద్దామని చెప్పి ‘విజయ్ సాయి’ అని పేరు పెట్టి పంపించానని తెలిపాడు. విజయ్ తన కొత్త సినిమా ‘అదిగో’లో కూడా కీలక పాత్ర పోషించాడని.. ఈ సినిమాకు డేట్లు అడిగితే.. మీరు ఎప్పుడంటే అప్పుడు నటిస్తానంటూ వచ్చి మూడు నెలల పాటు పని చేశాడని.. ఎక్కువ పారితోషకం ఇవ్వలేనని అంటే కూడా మీ ఇష్టం అన్నాడని రవిబాబు తెలిపాడు. తన తర్వాతి సినిమాలో కూడా విజయ్ నటించాల్సిందని.. రెండు నెలల కిందట కలిసినపుడు కూడా ఆ డిస్కషన్ జరిగిందని అన్నాడు. దీపావళి టైంలో ఒంగోలులో ఎవరో ఫ్రెండు షాపు నుంచి స్వీట్లు తెస్తానని అన్నాడని.. తీరా చూస్తే హైదరాబాదుకి వచ్చి ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఏకంగా 8 కేజీల స్వీట్లు ఇచ్చాడని రవిబాబు తెలిపాడు. అప్పుడతను వీక్ గా ఉన్నాడని.. ఏంటని అడిగితే డెంగ్యూ వల్ల అలా అయ్యానని చెప్పాడని.. మన సినిమా మొదలయ్యే సమయానికి మామూలుగా అవుతానని చెప్పాడని రవిబాబు తెలిపాడు.