చూపులు కలిసిన క్షణం

Update: 2017-08-26 04:47 GMT
లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. సినిమా వాళ్లకు బాగా ఇష్టమైన కాన్సెప్ట్. ఓ రకంగా చెప్పాలంటే ఎవర్ గ్రీన్ ఫార్ములా. ఈ ఒక్క కాన్సెప్ట్ తో సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్లు ఎంతో మంది ఉన్నారు. ఇది నిజ జీవితంలో సాధ్యమేనా అనిపించినా ఆ కాన్సెప్ట్ లో ఉన్న మాయ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది. సినీ జనాలకు ఇంతగా నచ్చిన ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ జంటను ఒకటి చేస్తోంది.

లాస్ట్ ఇయర్ అడవి శేష్ హీరోగా వచ్చిన లిమిటెడ్ బడ్జెట్ మూవీ క్షణం సూపర్ హిట్టయ్యింది. కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో తీసిన ఈ మూవీ ఎలాంటి హైప్ లేకుండా వచ్చి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో రవికాంత్ పేరెపు డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇందులో హీరోయిన్ గా హార్ట్ ఎటాక్ ఫేం అదాశర్మ నటించింది. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పిన అమ్మాయి ఘంటసాల వీణ. ఈమె ప్రఖ్యాత ప్లేబాక్ సింగర్ ఘంటసాల మనవరాలు.. ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్ కుమార్తె. క్షణం మూవీలో అదాశర్మకు డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన వీణను చూసి రవికాంత్ ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడిపోయాడట. అతడి లవ్ ప్రపోజల్ కు వీణ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వీరిద్దరూ త్వరలో ఒకటి కాబోతున్నారు. ఇటీవలే చెన్నైలో వీరిద్దరూ గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.  నవంబరు 11న వీరి వివాహం జరగనుంది.

క్షణం బేసిగ్గా థ్రిల్లర్ మూవీ. కాని ఆ లవ్ థ్రిల్లర్ కంటే వీరి లవ్ స్టోరీ బాగుంది అంటున్నారు సన్నిహితులు. ఇద్దరు అపరిచితులు ఒకచోట కలవడం... వాళ్లమధ్య లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పుట్టడం... వారిద్దరూ ప్రేమికులై చివరకు ఒకటి కావడం అనేది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఎలాగూ రవికాంత్ డైరెక్టరే కాబట్టి ఇదే లవ్ స్టోరీని సిినిమాగా తీస్తే సరి.
Tags:    

Similar News