ఆర్ట్ డైరెక్టర్ తో రాజమౌళి ఫాంహౌస్ డిజైన్

Update: 2016-02-10 11:30 GMT
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. భారీ బడ్జెట్ తో పెద్ద పెద్ద సినిమాలు తీస్తాడు. సినిమాల్లో అయితే రిచ్ నెస్ బోలెడు కనిపిస్తుంది కానీ.. నిజానికి ఈయన చాలా సింపుల్ మనిషి. ఓ అపార్ట్ మెంట్ లో ఉంటూ... సాధారణమైన కార్ వాడతాడంతే. ఎక్కువగా క్యాబ్ లోనే ఇంటికి వెళతాడు దాంతో .. జక్కన్న ఎంత సింపులో అర్ధమవుతుంది.

రాజమౌళికి సిటీ అట్మాస్ఫియర్ కంటే.. విలేజ్ వాతావరణం చాలా ఇష్టం. అందుకే తన హౌజ్ ను ఓ మినీ విలేజ్ రేంజ్ లో కట్టించాలని నిర్ణయించుకున్నాడు. హైద్రాబాద్ పరిసరాల్లో రాజమౌళికి 20 ఎకరాల ల్యాండ్ ఉంది. దీనిలో ఒక పెద్ద బిల్డింగ్ తో పాటు.. అక్కడక్కడా చిన్నపాటి ఇళ్లు ఉంటూ.. వ్యవసాయానికి వీలుగా కట్టించాలని నిర్ణయించాడు. ఇందుకోసం తన స్నేహితుడైన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ను డిజైన్ చేయాల్సిందిగా కోరాడు. రాజమౌళి ఊహలకు అనుగుణంగా.. ఈ డిజైన్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు రవీందర్.

మర్యాదరామన్న మూవీలో కనిపించే హౌస్ సెట్ ఈయన డిజైన్ చేసినదే. ఆ తర్వాత కూడా ఈ ఇంటిని చాలా సినిమాల్లో ఉపయోగించుకున్నారు. అలాగే రాజమౌళి 20ఎకరాల ఫాం హౌజ్ కు ఆనుకుని.. ఎంఎం కీరవాణికి 20 ఎకరాలు, సాయి కొర్రపాటికి 70 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇదంతా అగ్రికల్చరల్ ల్యాండ్ మాత్రమే.
Tags:    

Similar News