మెగాస్టార్ చిరంజీవి.. రజనీకాంత్ .. అమితాబ్ బచ్చన్ తరహాలోనే స్వయంకృషితో ఎదిగిన హీరోలు అరుదు. అయితే అలాంటి అరుదైన హీరోగా మాస్ మహారాజా రవితేజ పేరు టాలీవుడ్ హిస్టరీలో లిఖితమై ఉంది. లేట్ ఏజ్ లో బరిలో దిగినా లేటెస్టుగా సత్తా చాటిన హీరోగా మాస్ ఎనర్జిటిక్ హీరోగా అతడి కంటూ ఒక రేంజుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి అటుపై వన్ ఫైన్ డే హీరోగా టర్న్ అయ్యి స్టార్ హీరోగా రూపాంతరం చెందిన వైనం ఒక సినిమా స్టోరీలా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికిప్పుడు బయోపిక్ తీస్తే రవితేజ స్టోరి సరిపోతుందేమో! అనేంతగా ట్విస్టులు టర్నులు అతడి జీవితంలో ఉన్నాయి.
తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే కార్యక్రమంలో ఇలాంటి ఎన్నో విషయాల ప్రస్థావన వచ్చింది. ఆహాలో వస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలయ్య ప్రశ్నలకు చకచకా సమాధానాలిచ్చేస్తున్న రవితేజ తన వెనక పాలిటిక్స్ గురించి తాను అవకాశాలిచ్చి ప్రోత్సహించిన దర్శకుల గురించి కూడా మాట్లాడారు.
పూరి జగన్ వల్ల తనకు ఇడియట్ లాంటి సినిమా వచ్చిందని రవితేజ అన్నారు. ఇడియట్ .. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు లాంటి వరుస హిట్లతో దూసుకెళితే.. ఎవడ్రా దూసుకెళుతున్నాడు అని అన్నారట ఇండస్ట్రీలో. వెనక ఉండి రాజకీయాలు చేసింది ఎవరు? అని బాలయ్య రెట్టించి ప్రశ్నించినా .. అవన్నీ ఇక్కడ ఉంటాయి.. ఎందుకులెండి.. నేను లైట్ తీసుకుంటాను! అంటూ రవితేజ సమాధానం దాటవేశారు.బోయపాటి శ్రీను-బాబి -గోపిచంద్ మలినేని సహా ఆరేడుగురు దర్శకుల్ని తెరకు పరిచయం చేశానని ఇక్కడ ప్రతిభ ఉన్నవారంతా ఉంటారని లేని వారు వెళతారని అన్నారు.
బాలయ్యతో మాస్ రాజా సంభాషణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ రవితేజ ఎదిగే క్రమంలో అతడిపై కుళ్లుకున్నది ఎవరు? రాజకీయాలు నడిపించినది కామెంట్లు చేసినది ఎవరో తేలాల్సి ఉంది. రాజా కాస్త క్లారిటీ ఇస్తే బావుండేది కానీ ఇవ్వలేదు.