మాస్ మహారాజ్ రవితేజ చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వయసుపైబడుతున్న తరుణంలో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న కాన్సెప్ట్ ని తూచ తప్పకుండా పాటించేస్తున్నాడు. అయితే కిక్ 2 టాక్ కాస్త అటుఇటు అవ్వడంతో పెద్ద దర్శకుల కనుసన్నలకు రవితేజ దూరమయ్యాడు. ఇవేమీ పట్టని రవి తన తదుపరి సినిమాను ఇటీవలే ఫ్లాప్ కొట్టిన దర్శకుడితో చెయ్యడం విశేషం.
నిఖిల్ తో స్వామిరారా వంటి హిట్ తో ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ వర్మ ఆ తరువాత కాస్త అంచనాల నడుమ విడుదలైన 'దోచేయ్' నెగిటివ్ ఫలితాలని అందించింది. దాంతో అవుట్ ఫోకస్ లోకి వెళ్ళిపోయిన సుధీర్ చెప్పిన కధ నచ్చడంతో వెనుక ఫ్లాప్ వున్నా మన మాస్ మహారాజ్ ఏమాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
అయినా కంటెంట్ నచ్చితే ఫ్లాప్ దర్శకులతో సైతం చేయికలపడం మొదట్నుంచీ రవికున్నా అలవాటే.
తనతో 'షాక్' వంటి ప్లాప్ సినిమా తీసిన హరీశ్ శంకర్ తో రవితేజ 'మిరపకాయ్' సినిమా చేసాడి చేశాడు. అలానే 'అశోక్', 'అతిథి' చిత్రాలతో రెండు పరాజయాలను తన ఖాతాలో జమచేసుకున్న సురేందర్ రెడ్డికి 'కిక్' ఇచ్చాడు. హ్యాట్ ట్రిక్ ఫ్లాపుల తరువాత కూడా గుణశేఖర్ తో 'నిప్పు' చేయడానికి సాహసించాడు. మరి ఈ ప్రయత్నం ఏమవుతుందో చూడాలి.