మాస్ మహరాజ్ రవితేజ 'బెంగాల్ టైగర్'గా అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సంపత్‌నంది దర్శకత్వంలో ఈ చిత్రం శరవేగంగా తెరకెక్కుతోంది. ఈ నెలంతా రామోజీ ఫిలింసిటీలోనే షూటింగ్. వచ్చే నెల 5తో షెడ్యూల్ పూర్తవుతుంది. నాయకానాయికలు సహా ఇతర నటీనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. రవితేజ ఎనర్జీకి తగ్గట్టే పాత్ర చిత్రణ ఉంటుంది. వినోదం, యాక్షన్ కలగలుపుతో కథాంశం రక్తి కట్టిస్తుంది. ఇంకా చెప్పాలంటే రవితేజ పాత్ర చిత్రణ 'పులి విసిరిన పంజా'లా ఉంటుంది. తిరుగేలేనివాడిగా కనిపిస్తాడు.. అని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. రవితేజ నటించిన బలుపు హిట్టయ్యింది. ఆ తర్వాత పవర్ హిట్టయ్యింది. ఇప్పుడు బెంగాల్ టైగర్ హిట్టయితే హ్యాట్రిక్ కొట్టినట్టే. అయితే మునుపటి విజయాలన్నీ యావరేజ్ వసూళ్లనే దక్కించుకున్నాయి. అలా కాకుండా రవితేజ కూడా 50కోట్ల క్లబ్‌లో చేరితేనే పంజా విసిరినట్టు. అలా కాకుండా పాతికో, ముప్పయ్‌కో పరిమితమైతే అతడు బోనులోంచి బైటపడని పులి లాంటోడని అర్థం చేసుకోవాల్సొస్తుంది.ఇది నిజంగానే రవితేజకు సవాల్ లాంటిది. సవాల్‌ని పాజిటివ్‌గా స్వీకరించి వసూళ్ల పులిలా గాండ్రిస్తాడేమో చూడాలి.