RC 15: యూఎస్ రైట్స్.. డిమాండ్ ఎలా ఉందంటే?

Update: 2022-09-13 05:35 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత తండ్రి కోసం తీసిన ఆచార్య సినిమాతో మాత్రం డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక తదుపరి సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలై చాలాకాలం అయినప్పటికీ కూడా ఇంకా సరైన టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఈ కాంబినేషన్ పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.

RC15 సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ఆలోచిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ హక్కుల విషయంలో కూడా దిల్ రాజు చాలా ఓపికతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఓవర్సీస్ కు సంబంధించిన రైట్స్ విషయంలో కూడా పలు డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు కొనసాగించినట్లు సమాచారం.

ముఖ్యంగా యూఎస్లో రామ్ చరణ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది దానికి తోడు శంకర్ లాంటి దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ ఉండడంతో తప్పకుండా RC15వ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడే అవకాశం ఉంది.

కాబట్టి దిల్ రాజు కేవలం అమెరికాలోని దాదాపు 20 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను అమ్మేందుకు చూస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన చెప్పిన నెంబరు ఇంకా పెరిగే అవకాశం ఉందట. ఆ నెంబర్ కంటే ఎవరు ఎక్కువగా ఇస్తే వారికే సినిమాకులను ఇవ్వాలని చూస్తున్నారు.

దాదాపు 5 మిలియన్ డాలర్స్ టార్గెట్ ను అయితే ఈ సినిమా అందుకోగలదు అని కూడా ఆలోచిస్తున్నారు. అందుకే మరి కొన్ని రోజులు డీల్ క్లోజ్ చేయకుండా ఎదురు చూడాలి అని కూడా అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ ను మళ్లీ తిరిగి ప్రారంభించడంతో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు బ్రేకులు పడ్డాయి. రెండిటిని ఒకేసారి ఫినిష్ చేయాలి అని శంకర్ ఏదో ప్రణాళికలు రచిస్తున్నాడు కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా అనుమానంగానే ఉంది. కానీ దిల్ రాజు మాత్రం శంకర్ పై నమ్మకంతోనే ఉన్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News