RC 16.. బుచ్చిబాబు ప్రాజెక్ట్ కాదా?

Update: 2022-12-15 02:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `RRR` త‌రువాత సినిమాల విష‌యంలో ఊహించ‌ని విధంగా స్పీడు పెంచేశాడు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని లైన్ లో పెట్టేస్తూ వ‌రుస‌ప‌గా అనౌన్స్ చేస్తున్న విష‌యం తెలిసిందే. చ‌ర‌ణ్‌ ప్ర‌స్తుతం ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో త‌న RC15 లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే న్యూజిలాండ్ లో సాంగ్ షూట్ ని పూర్తి చేసుకున్న ఈ టీమ్ త‌దుప‌రి షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ ని జ‌న‌వ‌రి నుంచి మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ త‌రువాత రామ్ చ‌ర‌ణ్ రీసెంట్ గా మ‌రో క్రేజీ పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన విష‌యం తెలిసిందే. `ఉప్పెన‌` మూవీతో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్ష‌న్ లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇటీవ‌లే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే శంక‌ర్ మూవీని RC15 గా ప్ర‌క‌టించిన మేక‌ర్స్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ కు నంబ‌ర్ ని మెన్ష‌న్ చేయ‌క‌పోవ‌డంతో అంద‌రిలో క‌ఫ్యూజ‌న్ మొద‌లైంది.

ఈ మూవీకి ముందే సుకుమార్ తో ఓ సినిమాకి చ‌ర‌ణ్ క‌మిట్ అయిపోయాడు. ఓ సీన్ ని కూడా షూట్ చేసిన‌ట్టుగా వార్త‌లు కూడా వినిపించాయి.  ఫిల్మ్ కంపానియ‌న్ మీట్ లో రాజ‌మౌళి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన ఇంట్రో సీన్ గురించి వివ‌రించి..ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని చాలా ఎగ్జైటింగ్ వుంద‌ని తెలప‌డంతో `పుష్ప 2` త‌రువాత సుకుమార్ .. చ‌ర‌ణ్ తో సినిమా మొద‌లు పెడ‌తాడ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.  

ఈ సినిమాతో పాటు తాజాగా క‌న్న‌డ డైరెక్ట‌ర్ న‌ర్త‌న్ కు కూడా చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని తెలుస్తోంది. య‌ష్ ముందు చేస్తాన‌ని, ఆ త‌రువాత చివ‌రి నిమిషంలో హోల్డ్ లో పెట్ట‌డంతో న‌ర్త‌న్ ఫైన‌ల్ గా అదే క‌థ‌ని చ‌ర‌ణ్ కు చెప్పాడ‌ట‌.

ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామా కావ‌డంతో చ‌ర‌ణ్ .. న‌ర్త‌న్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల నేప‌థ్యంలో చ‌ర‌ణ్ 16 ఎవ‌రితో వుంటుంది? బ‌ఉచ్చిబాబు ప్రాజెక్ట్ 16 కాదా? .. మ‌రి RC15 కు బుచ్చిబాబు ప్రాజెక్ట్ కు మ‌ధ్య‌లో చ‌ర‌ణ్ RC16 ని ఎవ‌రితో చేయ‌బోతున్నాడ‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లోనే ఈ క‌న్ఫ్యూజ‌న్ పై క్లారిటీ రానుంద‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News