రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #RC12 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ దసరాకు రిలీజ్ కావలసిన సినిమా ఇది. కానీ షూటింగ్ లో డిలే తో పాటూ ఇతర కారణాల వల్ల సంక్రాంతి కి వెళ్ళింది. అయినా ఈ సినిమా కు ఇంకా ముప్పై రోజుల షూటింగ్ పెండింగ్ ఉండడం అనేది ఆలోచించాల్సిన విషయమే.
ఇప్పటికే 105 రోజుల వరకూ షూటింగ్ జరిగిందట. ఇంకా మరో నెల పాటు షూటింగ్ అంటే అది నవంబర్ ఆఖరుకి పూర్తయితే మేలు. దానికితోడు సినిమాను బ్యాంకాక్.. అజర్ బైజాన్ లాంటి లోకేషన్స్ తో పాటు బోయపాటికి సెంటిమెంట్ అయిన వైజాగ్ లాంటి లోకేషన్స్ లో కూడా షూటింగ్ చేస్తుండడం.. ప్రతి ఒక్క సీన్ ను భారీగా తీస్తుండడంతో ఖర్చు ముందు అనుకున్నదానికంటే భారీగా పెరిగిందట. ఇప్పుడు #RC12 కు మార్కెట్ లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా అమ్మినా నిర్మాత దానయ్యకు పెద్దగా లాభం ఉండే అవకాశం లేదంటే బడ్జెట్ ఎంత ఎక్కువయి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జక్కన్న తన సినిమాలను చెక్కినట్టు బోయపాటి కూడా చెక్కడం మొదలు పెట్టాడని అంటున్నారు. జక్కన్న సినిమల కథే వేరు కాబట్టి వాటితో బోయపాటి సినిమాలను పోల్చలేం. బోయపాటి మాస్ ఎంటర్టైనర్లకు ఆ రేంజ్ బడ్జెట్లు వర్క్ ఆవుట్ కావడం కష్టమే.
బోయపాటి గత చిత్రం 'జయ జానకీ నాయక' కాస్ట్ ఫెయిల్యూర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. అదే బడ్జెట్ కనుక అదుపులో ఉన్నట్టయితే హిట్ అయి ఉండేదన్న అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈసారి 'రంగస్థలం' హిట్ మీదున్న చరణ్ సినిమాకు బడ్జెట్ విషయంలో ఇలాంటి టాక్ వినిపిస్తుండడం ఏంటో?