ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాల హిట్‌తో ఊపు మీదున్న రామ్‌చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 ప్రాజెక్టు షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా జరుపుకుంటున్న ఈ షూటింగ్‌కు చిత్రబృందం కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే జూన్ 20 నుంచి నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
RRR, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ మీద ఫ్యాన్స్ అంచనాలు పెరిగాయి. ఆయన తదుపరి సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు హైప్ పెరిగింది.
దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. చెర్రీతో ఈమె జత కట్టడం ఇది రెండో సారి. గతంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామలో రామ్‌చరణ్‌తో కలిసి కియారా నటించింది.
RC15 నుంచి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌కు గతంలో గ్యాప్ ఇచ్చారు. జూన్ 20 నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. గత షెడ్యూల్‌ను వైజాగ్‌లో చిత్రీకరించారు. మరి ఇప్పుడు కూడా అక్కడే కంటిన్యూ చేస్తారా లేక వేరే లొకేషన్‌కు మారాతారా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కోసమే దాదాపు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేశారట. ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తోన్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.200 కోట్లు అని సమాచారం. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికి మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్రటీమ్ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంది. అతి త్వరలోనే షూటింగ్ మళ్లీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు "అధికారి" అనే టైటిల్ ను లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈ సినిమా బృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.