రాజమౌళి కోసమే ఆ డీల్ ఒప్పుకుందా ?

Update: 2019-04-13 07:45 GMT
అంతా సవ్యంగా ఉండి రామ్ చరణ్ కు గాయం కాకపోయి ఉంటే ఈపాటికి పూణేలో ఆర్ ఆర్ ఆర్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్ లో ఉండేది. ఇందులో జాయిన్ అయ్యేలా అలియా భట్ తో డేట్స్ తీసుకుని రాజమౌళి ముందే ప్లాన్ చేసుకున్నాడు. అయితే జరిగింది వేరు. అనుకున్నవి జరగకపోవడం ఇలాంటి భారీ సినిమాల నిర్మాణంలో మాములే కాబట్టి అందరూ లైట్ తీసుకున్నారు.

అయితే అలియా భట్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉండొచ్చు అనే దాని గురించి మాత్రం ఊహగానాలు ఒక కొలిక్కి రాలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అక్షరాలా 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. నిజానికి అలియా భట్ డిమాండ్ కి ఇది చిన్న మొత్తం. దీని స్థానంలో ఏ హింది మల్టీ స్టారర్ ఒప్పుకున్నా ఇంతకు రెట్టింపు వస్తుంది. మరి అలియా ఎందుకు ఒప్పుకుంది అనే డౌట్ రావడం సహజం

దీనికి రెండు కారణాలు ఉన్నాయట. ఒకటి రాజమౌళి సినిమా కావడం. ఎందరో ఎదురు చూసే అవకాశం కోరి తన తలుపు తట్టింది. రెండోది తన పాత్ర. సీత పేరుతో ఉండే అలియా రోల్ సినిమా మొత్తం కనిపించదట. మొత్తం లెక్కేస్తే అరగంట నుంచి నలభై నిమిషాల లోపే ఉంటుందని తెలిసింది. అందుకే ఎక్కువ బల్క్ డేట్స్ అవసరం లేదని తక్కువ కాల్ షీట్స్ తో ఫినిష్ చేస్తారని జక్కన్న మాటివ్వడం వల్లే అలియా ఇంకెక్కువ ఆలోచించే అవసరం పడలేదని వినికిడి.

డ్రీం సాంగ్స్ స్టెప్స్ వేసె మసాలా పాటలు ఏవి ఉండవు కాబట్టి అలియాకు భారం తగ్గినట్టే. అనూహ్యంగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు చిన్న బ్రేక్ పడటంతో అలియా భట్ డేట్స్ ని సెట్ చేసుకోవడం టీంకు చిన్న సవాల్ లా మారింది. ఇలాంటివి ఎన్నో ఫేస్ చేసిన రాజమౌళి ఈ సమస్య ఒక లెక్కా
    

Tags:    

Similar News