సైరా భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి మెగా హీరోలంతా ఒకే గొడుగు కిందికి వస్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం అవుతోంది. ఒకే ఫ్రేమ్ లో మొత్తం మెగా హీరోలందరినీ చూసుకునే వీలుందని మెగా ఫ్యాన్స్ ఉరకలెత్తారు. అందుకు తగ్గట్టే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ కి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. దాదాపు 30వేల మందికి సరిపడే ఈ వెన్యూ వద్ద అభిమానుల కోలాహాలం పెద్ద రేంజులోనే కనబడింది.
ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేములో కనిపించి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అయితే ఈ వేడుకలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మిస్సయిన లోటు కనిపించింది ఫ్యాన్స్ కు. సాయిధరమ్-వరుణ్ తేజ్ వచ్చారు.. కానీ అల్లు అర్జున్ కనిపించలేదు ఎందుకని? అంటూ ఫ్యాన్స్ మధ్య చర్చ సాగింది. అసలింతకీ బన్నీకి ఏమైంది.. ఎందుకని రాలేదు? అంటూ అభిమానులు ఆరాలు తీశారు. అంతటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్ కి స్కిప్ కొడితే ఎలా అంటూ ముచ్చట సాగింది.
కొందరు ఫ్యాన్స్ లో వేరొక రకంగానూ మాటా మంతీ సాగింది. అల్లు అర్జున్ తనకంటూ ఓ సపరేట్ రూట్ ఉందని అనుకుంటున్నారా? అందుకే మెగాస్టార్ ఈవెంట్ కి రాలేదా? అంటూ చిరు అభిమానులు కొంతమంది గరంగానే ఫీలయ్యారు. అయితే కొందరు మాత్రం ఈ వేదికకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విచ్చేస్తున్నారు కాబట్టి.. గత వివాదాల దృష్ట్యా.. వేదిక వద్ద పవన్ ఫ్యాన్స్ తో చిక్కులు ఎందుకని అనుకుని రాలేదా? అంటూ ముచ్చటించుకున్నారు. అసలింతకీ బన్ని ఎందుకని రాలేదు?
మెగాస్టార్ .. రామ్ చరణ్ లకు ధీటైన క్రేజు.. ఫ్యాన్ ఫాలోయింగ్ తనకు ఉన్నాయన్న ధీమానా అంటూ మెగా ఫ్యాన్స్ చాటింగ్ లో వినిపించింది.
ఇదొక్కటే కాదు.. సైరా ట్రైలర్ కి ఇండస్ట్రీ దిగ్గజాలంతా కాంప్లిమెంట్లు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. ఈ ట్రైలర్ పైనా అల్లు అర్జున్ ట్వీట్ చేయలేదు.. ఇతర స్టార్లంతా ట్వీట్లు రీట్వీట్లతో హడావుడి చేశారు. ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్ మహేష్.. ఎస్.ఎస్.రాజమౌళి .. పూరి జగన్నాథ్ అంతటి వారే ప్రశంసల వర్షం కురిపిస్తుంటే బన్ని ఇంకా దీనిపై స్పందించలేదేమిటి? అంటూ మెగా ఫ్యాన్స్ లో ముచ్చట సాగింది. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ బన్నీనే స్వయంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఏదైనా ఇబ్బంది ఉండి రాలేకపోవచ్చు కదా! అని అదే ఫ్యాన్స్ లోనే చర్చ సాగింది సుమీ.