అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దేశభక్తి ప్రధానాశంగా వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బన్నీ ఆవేశపరుడైన మిలటరీ ఆఫీసర్ గా నటించాడు. సినిమాకు కలెక్షన్లు బాగానే ఉన్నా ఆశించిన స్థాయిలో మాత్రం లేవు. దీంతో సినిమాను ప్రమోట్ చేయడంపై యూనిట్ ఫోకస్ పెట్టింది.
నా పేరు సూర్య సినిమా రిలీజ్ అయిన తరవాత ఎన్ని రకాల ప్రమోషన్ ప్రోగ్రాంలు చేసినా హీరోయిన్ అను ఇమ్మానుయేల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో అను చాలా డిజప్పాయింట్ అయిందని.. అందుకే ఆమె ప్రమోషన్లకు హ్యాండ్ ఇచ్చిందనే టాక్ వినిపించింది. రీసెంట్ గా జరిగిన థ్యాంక్స్ మీట్ కు కూడా ఆమె రాలేదు. దీంతో అనుకు ఈ సినిమాను పట్టించుకోవడం లేదనే వాదనకు బలం పెరిగింది. దాంతో ఈ భామ ఎట్టకేలకు రెస్పాండయింది. తాను ఎందుకు సినిమా ఈవెంట్లకు రావడం లేదో చెబతూ ట్విట్టర్ లో పోస్టు పెట్టింది.
‘‘దురదృష్టవశాత్తు నాపేరు సూర్య థ్యాంక్స్ మీట్ కు రాలేకపోయా. అక్కడకు రావాలని ఎంతో అనుకున్నా. కానీ కొన్ని ఫ్యామిలీ మేటర్స్ వల్ల కుదరలేదు. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. ఈ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం తెరవెనుక.. తెరముందు పనిచేసిన వారందరికీ థ్యాంక్స్’’ అంటూ అను ఇమ్మానుయేల్ తన ట్వీట్ తో సినిమా యూనిట్ జోష్ ఇచ్చింది.