అందుకే వెయిట్ తగ్గట్లేదు

Update: 2018-01-22 16:47 GMT
అరుంధ‌తి అంటారో - జేజ‌మ్మ అంటారో... దేవ‌సేన అని పిలుస్తారో మీఇష్టం. ఏమ‌ని పిలిచినా ప‌లికేస్తుంది అందాల తార అనుష్క‌. ఆమె ఫ్యాన్స్ ఆమెను పేరుతో క‌న్నా సినిమా పేర్ల‌తోనే పిలుచుకుంటారు. చ‌క్క‌న‌మ్మ చిక్కినా అంద‌మే సామెత‌ను తెలుసుగా... మ‌నం అనుష్క కోసం ఈ సామెత‌ను కాస్త మార్చుకుందాం. చ‌క్క‌న‌మ్మ‌ లావెక్కిన అంద‌మే అనుకుందాం. అనుష్క ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఇదే మ‌రి.

గ‌త రెండు మూడేళ్లుగా అనుష్క భారీ సైజు చూసి వెండితెర కూడా అదిరింది. సెన్సెష‌న‌ల్ హిట్ కొడ‌దాం అని ఆశించి సైజు జీరో కోసం తెగ లావెక్కింది. ఆ త‌రువాత సాధార‌ణ సైజుకు రావ‌డానికి అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నా.. యోగాను పొద్ద‌స్త‌మానం చేస్తున్నా ఫ‌లితం లేకుండా పోయింది. ఆమె లావు ఎఫెక్ట్ మొన్న‌టి బాహుబ‌లి మీద కూడా బాగానే ప‌డింద‌ని టాక్ వ‌చ్చింది. ఆమెను స‌న్న‌గా చూపించేందుకు జ‌క్క‌న్న చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో ఒక‌టే గుస‌గుస‌లు వినిపించాయ్. అనుష్క బొద్దుత‌నంపై వ‌చ్చిన వార్త‌లు - పోస్టులు చూసి ఆమెకెలా అనిపించిందో కానీ అభిమానుల‌కు మాత్రం చిర్రెత్తుకొస్తోంది. ఎంత‌గా అంటే   అనుష్క ఎందుకు లావు త‌గ్గాలి? ఆమె త‌గ్గ‌దు. ఇలానే ఉంటుంది... అని ఆమె త‌ర‌పునే అభిమానులు వాదించేంత‌గా. అసలు ఈమె వెయిట్ వెనుక్ రీజన్ ఏముందంటారు?

'నిజానికి నాకు కూడా నాజూకుగా అయిపోవాలనే ఉంది. ఆ క్రమంలో నాకు కొన్ని గాయాలయ్యాయ్. అవే మానే వరకు మళ్ళీ ఎక్సర్ సైజ్ చేయలేను. అందుకే బరువు తగ్గడం అనే ప్రక్రియ బాగా లేటవుతోంది. అంతకుమించి ఇందులో దాయాల్సింది ఏమీ లేదు'' అంటూ సెలవిచ్చింది అనుష్క. భాగమతి ప్రమోషన్ల సందర్భంగా ఈ విషయం చెప్పేసిందిలే. అనుష్క లావు గురించి ప‌క్క‌న పెడితే... భాగ‌మ‌తి కానీ హిట్ కొడితే... స్వీటీ మ‌ళ్లీ బిజీ కావ‌డం ఖాయం అంటున్నారు సినీ జ‌నాలు.
Tags:    

Similar News